తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ishan Kishan On Rohit: ప్లేఆఫ్స్ కోసం రోహిత్ పరుగులు దాచిపెడుతున్నాడు: ఇషాన్ కిషన్

Ishan Kishan on Rohit: ప్లేఆఫ్స్ కోసం రోహిత్ పరుగులు దాచిపెడుతున్నాడు: ఇషాన్ కిషన్

Hari Prasad S HT Telugu

11 May 2023, 18:28 IST

    • Ishan Kishan on Rohit: ప్లేఆఫ్స్ కోసం రోహిత్ పరుగులు దాచిపెడుతున్నాడు అని అన్నాడు ఇషాన్ కిషన్. తమ కెప్టెన్ ఫామ్ లో లేకపోవడంపై స్పందిస్తూ ఇషాన్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (AFP)

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ

Ishan Kishan on Rohit: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కావడానికి దగ్గరలో ఉంది. అయితే ఈ సీజన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడమే వాళ్లకు కాస్త మైనస్ గా మారింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ లోనూ ముంబై గెలిచినా.. రోహిత్ 7 పరుగులే చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ ఫామ్ పై ముంబై బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పందించాడు. హర్భజన్, సునీల్ గవాస్కర్ లతో మాట్లాడిన అతడు.. రోహిత్ ప్లేఆఫ్స్ కోసం పరుగులు దాచిపెట్టాడని అనడం విశేషం. ఈ సీజన్ అసలు ఫామ్ లో లేని రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లో ఎలా ఉంటున్నాడు? అతని ఆలోచనలు ఏంటి అని ఇషాన్ ను అడిగాడు హర్భజన్ సింగ్.

దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. "తన ఫామ్ చూసి అతడు కంగారు పడటం లేదు. ప్రాక్టీస్ సెషన్స్ లో తన ప్రాసెస్ పై అతడు దృష్టిపెడుతున్నాడు. కానీ ఈ ఆటలో పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇబ్బంది పడటం చూశాం. కానీ నాకు తెలిసి అతడు ప్లేఆఫ్స్ కోసం పరుగులు దాచి పెట్టుకున్నాడని అనిపిస్తోంది" అని అనడంతో పక్కనే ఉన్న హర్భజన్, గవాస్కర్ నవ్వారు.

అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం కూడా అని గవాస్కర్ అనడంతో అవును అది కూడా కరెక్టే అని ఇషాన్ అన్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ ఫెయిలైనా.. ఇషాన్, సూర్య చెలరేగారు. ముఖ్యంగా సూర్య అయితే కేవలం 35 బంతుల్లోనే 83 రన్స్ చేసి.. ఐపీఎల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. దీంత ముంబై కేవలం 16.3 ఓవర్లలోనే 200 రన్స్ టార్గెట్ చేజ్ చేసింది.