SRH Vs DC Fan War : సన్‌రైజర్స్, ఢిల్లీ మ్యాచ్‌లో గొడవ.. ఘోరంగా కొట్టుకున్న ఫ్యాన్స్!
30 April 2023, 13:40 IST
- SRH Vs DC : ఢిల్లీ క్యాపిటల్స్ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ జరుగుతుండగా ఫ్యాన్ వార్ జరిగింది. ఫ్యాన్స్ దారుణంగా కొట్టుకున్నారు.
ఫ్యాన్ వార్
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మ్యాచ్ జరుగుతుండగా ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మీద సన్ రైజర్స్ హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ పాయింట్స్ పట్టికలో ఢిల్లీ కింద ఉంది. శనివారం మ్యాచ్ జరుగుతుండగా.. ఢిల్లీ, సన్ రైజర్స్ ఫ్యాన్స్ మధ్య గొడవ మెుదలైంది. రెండు వర్గాలుగా చీలిపోయిన కొందరు అభిమానులు కొట్లాటకు దిగారు. స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగానే.. గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Viral) అయింది.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయంటున్నారు. అలాంటీ టీమ్స్ విషయంలో గొడవ ఎందుకయ్యా అని ప్రశ్నిస్తున్నారు. అయినా.. ఆటలో ఎవరో ఒకరు గెలుస్తారు. అలాంటప్పుడు ఇలా గొడవ పడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ కు 8 పాయింట్లు వచ్చాయి. మరో మ్యాచ్ గెలిస్తే సన్‌రైజర్స్ టాప్ నాలుగు జట్లతో సమానం అయ్యే అవకాశం ఉంది.
శనివారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), సన్ రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) మధ్య మ్యాచ్ జరిగింది. దీంట్లో హైదరాబాద్ విజయం సాధించింది. ఐపీఎల్-16వ సీజన్లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో అయిదు ఓటమలు మూటగట్టుకుంది హైదరాబాద్. ప్లేఆఫ్ రేసులో వెనుకబడింది. శనివారం మ్యాచ్‌తో కాస్త వేగం పుంజుకుంది. ఢిల్లీపై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ, క్లాసెన్ మెరుపులతో మొదట హైదరాబాద్ 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అక్షర్ పటేల్ కూడా ఆకట్టుకున్నాడు.
మార్ష్ బ్యాటింగ్‌లో చెలరేగడం, ఫిల్ సాల్ట్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడటంతో ఛేదనలో ఢిల్లీ దూసుకెళ్లింది. అయితే కాసేపటికే సన్‌రైజర్స్ బౌలర్లు(Sun Risers Bowlers) పుంజుకున్నారు. జట్టును కట్టడి చేశారు. చివరికి ఢిల్లీ 6 వికెట్లకు 188 పరుగులే చేసింది. ఎనిమిది 8 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది మూడో విజయం. ఢిల్లీ ఖాతాలో ఆరో ఓటమి పడింది.