తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Paints Chairs: స్టేడియంలో కుర్చీలకు రంగులు వేసిన ధోనీ.. వీడియో వైరల్

Dhoni paints chairs: స్టేడియంలో కుర్చీలకు రంగులు వేసిన ధోనీ.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

27 March 2023, 19:30 IST

google News
  • Dhoni paints chairs: స్టేడియంలో కుర్చీలకు రంగులు వేశాడు ధోనీ. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐపీఎల్ కోసం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ ధోనీ ఇలా సరదాగా ఈ పని కూడా చేయడం విశేషం.

స్టేడియంలో కుర్చీలకు పెయింట్ వేస్తున్న ధోనీ
స్టేడియంలో కుర్చీలకు పెయింట్ వేస్తున్న ధోనీ (CSK Twitter)

స్టేడియంలో కుర్చీలకు పెయింట్ వేస్తున్న ధోనీ

Dhoni paints chairs: మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ క్రికెట్ ఫీల్డ్ లోపల, బయట అంతే కూల్ గా ఉంటాడు. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతాడు.. తన ఇంట్లో ఉన్న మేకలతో ఆడుకుంటాడు.. బైక్ ఎక్కి రోడ్లపై చెక్కర్లు కొడతాడు.. క్రికెటర్ గా, టీమిండియా గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా.. చిన్న చిన్న పనుల్లో ఆనందం పొందడం ఎలాగో ధోనీని చూసి నేర్చుకోవాలి.

తాజాగా అతడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఉన్న చెయిర్లకు పెయింట్ వేయడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ లో ఉంటూ చాలా రోజులుగా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. సోమవారం (మార్చి 27) స్టాండ్స్ లో ఉన్న చెయిర్లకు పెయింట్ వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. పెయింట్ ఎలా వేస్తారో తెలుసుకొని ఆ పని చేస్తూ స్టాండ్స్ లో కనిపించిన అభిమానులను చూస్తే.. ఇది పని చేస్తోంది అని అతడు అనడం విశేషం. డార్క్ కలర్ అయితే మరింత ఈజీగా పెయింట్ వేయొచ్చని అతడు అన్నాడు. కొత్త సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టేడియాన్ని సుందరీకరిస్తున్నారు.

అది చూసిన ధోనీ సరదాగా తాను కూడా ఓ చేయి వేశాడు. 41 ఏళ్ల ఈ మిస్టర్ కూల్ ఎల్లో జెర్సీలో బహుశా తన చివరి ఐపీఎల్ సీజన్ లో ఆడబోతున్నాడు. తన సొంత ప్రేక్షకుల ముందు ఆడి ఈ మెగా లీగ్ కు కూడా గుడ్ బై చెప్పాలని ఉందని గతేడాది ధోనీ చెప్పాడు. రెండేళ్ల కిందటే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అతడు.. ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొని చెన్నై ఫ్రాంఛైజీలోనే మరో రూపంలో కొనసాగే అవకాశం ఉంది.

ఇప్పటికే కెప్టెన్ గా నాలుగుసార్లు చెన్నైని ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ఇప్పుడు చివరిసారి ట్రోఫీతోనే కెరీర్ ముగించాలని ధోనీ భావిస్తున్నాడు. గతేడాది చెన్నై మరీ దారుణంగా ఆడింది. ఏకంగా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి ఇండియాలో హోమ్, అవే పద్ధతిలో మ్యాచ్ లు జరుగుతుండటంతో దేశంలోని ప్రతి స్టేడియంలో తన చివరి మ్యాచ్ ఆడి ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడానికి ధోనీ సిద్ధమవుతున్నాడు.

తదుపరి వ్యాసం