తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Host Boxing Championship: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌నకు భారత్ ఆతిథ్యం.. ఎప్పుడంటే?

India Host Boxing Championship: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌నకు భారత్ ఆతిథ్యం.. ఎప్పుడంటే?

09 November 2022, 12:42 IST

google News
    • India Host Boxing Championship: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌నకు ఇండియా ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఈవెంట్‌ను న్యూదిల్లీ వేదికగా నిర్వహించనున్నారు.
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యం
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యం (Mohammed Aleemuddin)

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యం

India Host Boxing Championship: ఈ ఏడాది టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ టోర్నీకి భారత్ ఆతిత్యమివ్వనుంది. 2023లో న్యూదిల్లీ వేదికగా వరల్డ్ వుమెన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించనున్నారు. రెండేళ్ల క్రితం గ్లోబల్ గవర్నింగ్ బాడీకి అవసరమైన రుసుము చెల్లించనందుకు పురుషుల బాక్సింగ్ ఈవెంట్‌ ఆతిథ్య హక్కుల నుంచి భారత్‌ను తొలగించారు. దీంతో వచ్చే ఏడాది మహిళల బాక్సింగ్ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది భారత్.

ఇండియా ఇప్పటి వరకు రెండు సార్లు మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌కు ఆతిథ్యమిచ్చింది. మొదటిసారి 2006లో చేయగా.. 2018లో రెండోసారి హోస్ట్‌ చేసింది. అయితే పురుషుల ఈవెంట్‌కు భారత్ ఇప్పటి వరకు ఆతిథ్యాన్ని ఇవ్వలేదు.

"మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ హోస్టింగ్ హక్కులను మనం పొందాము. మార్చి చివర్లోనో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలుకుంటున్నాం. ఈవెంట్ తేదీలు ఇంకా ఖరారు చేయలేదు. మేము ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు క్లైమేవ్‌తో చర్చించి ఓ ఒప్పందానికి వస్తాము." అని భారత బాక్సింగ్ ఫెడరేషన్(BFI) హేమంత కలిత చెప్పారు.

ఈ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే అవకాశముంది. ఆతిథ్య రుసుమును చెల్లించడంలో విఫలమైన తర్వాత BFI సెర్బియాకు 2021 ఈవెంట్ హోస్టింగ్ హక్కులను కోల్పోయింది.దీనితో అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (AIBA) ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ ఏడాది టర్కీలో జరిగిన మహిళల ఈవెంట్ యొక్క చివరి ఎడిషన్‌లో, ఫ్లై వెయిట్ విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణంతో సహా మూడు పతకాలతో భారతదేశం తిరిగి వచ్చింది.

తదుపరి వ్యాసం