తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jos Buttler About T20 Wc Final: భారత్-పాక్ ఫైనల్ ఆడకుండా మేము చూస్తాం.. బట్లర్ సంచలన వ్యాఖ్యలు

Jos Buttler About T20 WC Final: భారత్-పాక్ ఫైనల్ ఆడకుండా మేము చూస్తాం.. బట్లర్ సంచలన వ్యాఖ్యలు

09 November 2022, 11:43 IST

google News
    • Jos Buttler About T20 WC Final: ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ ఫైనల్‌ ఆడాలని అభిమానులు కోరుకుంటుండగా.. అలా జరగకుండా తాము చూస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ స్పష్టం చేశాడు.
జాస్ బట్లర్
జాస్ బట్లర్ (AFP)

జాస్ బట్లర్

Jos Buttler About T20 WC Final: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నవంబరు 10న భారత్-ఇంగ్లాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందు బుధవారం నాడు న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. అయితే భారత అభిమానులు మాత్రం ఈ రెండు సెమీస్ మ్యాచ్‌ల్లో ఆసియా దేశాలు గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే భారత్-పాకిస్థాన్‌ మరోసారి ఫైనల్‌లో తలపడితే చూడాలని సగటు అభిమానితో పాటు ఇరుదేశాల మాజీలు కూడా ఆశిస్తున్నారు. సరిగ్గా 2007 టీ20 ప్రపంచకప్ మాదిరిగా ఆ ఘటన మరోసారి రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఇందుకు విరుద్ధంగా స్పందించాడు. భారత్-పాక్ ఫైనల్‌లో ఆడకుండా చూడటమే తమ బాధ్యత అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"భారత్-పాకిస్థాన్‌ను ఫైనల్‌లో చూడాలని మేము కచ్చితంగా కోరుకోవడం లేదు. కాబట్టి జరగకుండా చూసుకోవడానికి మేము చేయాల్సిదంతా చేస్తాము. టీమిండియాపై మెరుగ్గా ఆడి ఆ జట్టును సెమీస్‌కు పరిమితం చేస్తాం" అని జాస్ బట్లర్ అన్నాడు.

"నాకౌట్ గేముల్లోనే భారత్.. తన బలాన్ని, పదునును కోల్పోయిందా? అని బట్లర్‌ను ప్రశ్నించగా.. కాదని అతడు సమాధానమిచ్చాడు. భారత్ చాలా బలమైన జట్టు అని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి భారత జట్టు బలంగా ఉంటుంది. ప్రతిభ కారణంగానే ఆ జట్టు అంతా స్ట్రాంగ్‌గా ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి వారి బ్యాటింగ్ లైనప్‌ చాలా బలంగా ఉంది. కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. సెమీ ఫైనల్‌లో ఎలాంటి బలమైన జట్టుతో ఆడాలని కోరుకుంటారో అలాంటి జట్టే భారత్." అని బట్లర్ స్పష్టం చేశాడు.

ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్ చేరడమే కాకుండా గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. నవంబరు 10న అడిలైడ్ వైదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది.

తదుపరి వ్యాసం