virat kohli: కోహ్లి గొప్పతనాన్ని అతడి రికార్డులే చెబుతాయి: జోస్ బట్లర్
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లి ఒకడని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు. త్వరలోనే కోహ్లి తప్పకుండా ఫామ్ లోకి వస్తాడని పేర్కొన్నాడు. కొన్ని మ్యాచ్ లలో విఫలమైతే అతడిపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్ లో కోహ్లికి తొలి మ్యాచ్ లకు దూరమయ్యాడు. విశ్రాంతి పేరుతో అతడిని పక్కనపెట్టారు. ఈ నెలాఖరు నుండి వెస్టిండీస్ తో జరుగనున్న సిరీస్ కు కోహ్లితో పాటు బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. రెస్ట్ కాన్సెప్ట్ పై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ విశ్రాంతి వల్ల అతడి కెరీర్ కు పెద్దగా ఉపయోగం ఉందని కొందరు మాజీ క్రికెటర్లు చెబుతుండగా మరికొందరు మాత్రం రెస్ట్ మంచిదేనంటూ అభిప్రాయపడుతున్నారు. వెస్టిండీస్ సిరీస్ కు అతడికి విశ్రాంతి కల్పించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ అన్నాడు.
టీ20 లు రెగ్యులర్ గా ఆడితేనే అతడు ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. విఫలమవుతున్న ఒక్కో మ్యాచ్ ద్వారా అతడిపై మరింత ఒత్తిడి పెరగడంతో పాటు కోహ్లి ఆటతీరుపై సందేహాల్ని పెంచుతుందని పేర్కొన్నాడు. ఇలాంటి తరుణంలో రెస్ట్ తీసుకోవడం వల్ల అతడి ఆటతీరు మెరుగవుతుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు. మరోవైపు కోహ్లి పేలవ ఫామ్ పై విమర్శలు పెరుగుతున్న తరుణంలో పలువురు క్రికెటర్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని మ్యాచ్ లలో పరుగులు చేయనంత మాత్రాన అతడి ఆటతీరుపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నాడు.
ఎలాంటి ప్లేయర్ ఆయినా కెరీర్ లో ఏదో ఒక సందర్భంలో ఫామ్ లేమితో సమస్యలు ఎదుర్కోవడం సహజమని తెలిపాడు. తన బ్యాటింగ్ ప్రతిభతో ఎన్నో మ్యాచ్ లలో టీమ్ ఇండియాకు కోహ్లి అద్భుతమైన విజయాల్ని అందించాడని పేర్కొన్నాడు. కోహ్లి తొందరలోనే పూర్వపు ఫామ్ లోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే తమతో జరుగుతున్న సిరీస్ లో కోహ్లి ఫామ్ అందుకోకపోవడమే మంచిదంటూ ఫన్నీగా కామెంట్స్ చేశాడు. అప్పుడే తాము పైచేయి సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్