CWG 2022 Day 10 Live Updates: బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు గోల్డ్ మెడల్-commonwealth games 2022 day 10 live updates ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Commonwealth Games 2022 Day 10 Live Updates

పీవీ సింధు(twitter)

CWG 2022 Day 10 Live Updates: బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు గోల్డ్ మెడల్

06:16 AM ISTNelki Naresh Kumar
  • Share on Facebook
06:16 AM IST

కామన్వెల్త్ గేమ్స్ లో తొమ్మిది రోజుల్లో 40 మెడ‌ల్స్ తో అత్య‌ధిక ప‌త‌కాలు సాధించిన దేశాల్లో ఐదో స్థానంలో నిలిచింది ఇండియా. రెజ్లింగ్‌లో భార‌త ప్లేయ‌ర్స్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశారు. ప‌న్నెండు ప‌త‌కాలు నెగ్గి క్రీడాభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ప‌దోరోజు కూడా ప‌లు ఈవెంట్స్‌లో మెడ‌ల్స్ పోరుకు భార‌త ప్లేయ‌ర్లు సిద్ధ‌మ‌య్యారు. బ్యాడ్మింట‌న్‌లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, ల‌క్ష్య‌సేన్ సెమీఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌బోతున్నారు. టీ20 క్రికెట్‌లో ఫైన‌ల్ చేరిన భార‌త ఉమెన్స్ టీమ్ గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకునేందుకు నేడు తుది పోరుకు రెడీ అయ్యింది. టేబుల్ టెన్నిస్‌లో మిక్స్‌డ్‌, సింగిల్స్‌లో తెలుగు ప్లేయ‌ర్లు శ్రీజ ఆకుల‌, ఆచంట శ‌ర‌త్ క‌మ‌ల్స్ గోల్డ్ సాధిస్తారా లేదా అన్న‌ది నేడు తేల‌నుంది. 

Sun, 07 Aug 202202:14 PM IST

 నిఖత్ జరీన్ కు గోల్డ్ మెడల్

ఉమెన్స్ యాభై కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 

Sun, 07 Aug 202212:28 PM IST

బ్యాడ్మింటన్ సెమీస్ లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి

బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్ లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. మలేషియన్ ప్లేయర్ యంగ్ పై చేతిలో ఓటమి చవిచూశాడు.

Sun, 07 Aug 202211:53 AM IST

జావెలిన్ త్రో లో అన్నూరాణి బ్రాంజ్ మెడల్

జావెలిన్ త్రోలో ఇండియన్ ప్లేయర్ అన్నూ రాణి బ్రాంజ్ మెడల్ లభించింది. జావెలిన్ ను 60 మీటర్లు విసిరి కాంస్యం సొంతం చేసుకున్నది.

Sun, 07 Aug 202211:21 AM IST

బ్యాడ్మింటన్ ఫైనల్స్ లో లక్ష్యసేన్

బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ లో భారత ప్లేయర్ లక్ష్య సేన్ ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్ లో సింగపూర్ ప్లేయర్ జియా హింగ్ థే పై 21 - 10 18- 21 21 -16 తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్ లోకి ప్రవేశించాడు.

Sun, 07 Aug 202211:21 AM IST

పది కిలోమీటర్ల రేస్ వాక్ లో సందీప్ కుమార్ కు కాంస్యం

పది కిలోమీటర్ల రేస్ వాక్ లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు.

Sun, 07 Aug 202211:21 AM IST

ట్రిపుల్ జంప్ లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ ఇండియావే

ట్రిపుల్ జంప్ లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ రెండు ఇండియన్ ప్లేయర్స్ గెలుచుకొని చరిత్రను సృష్టించారు. ఎల్డోస్ పాల్ 17.03 మీటర్లు దూకి గోల్డ్ మెడల్ దక్కించుకోగా అబ్దుల్లా అబూబాకర్ 17.02 మీటర్లతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 

Sun, 07 Aug 202210:34 AM IST

బాక్సింగ్ లో అమిత్ పంగల్ కు గోల్డ్ మెడల్

బాక్సింగ్ లో అమిత్ పంగల్ గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. 51 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ మెక్ డొనాల్డ్ పై 5- 0 తేడాతో విజయాన్ని సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

Sun, 07 Aug 202210:20 AM IST

బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న నీతు

బాక్సింగ్ 48 కేజీల విభాగంలో భారత బాక్సర్ నీతు గోల్డ్ మెడల్ దక్కించుకున్నది. ఆదివారం జరిగిన ఫైనల్ లో కెనెడా బాక్సర్ రెజ్టన్ 5 - 0తో ఓడించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నది నీతు

Sun, 07 Aug 202210:20 AM IST

బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకున్న ఇండియా ఉమెన్స్ హాకీ టీమ్‌

ఆదివారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో ఇండియా ఉమెన్స్ హాకీ టీమ్ 2-1 తేడాతో విజ‌యాన్ని సాధించి ప‌త‌కాన్ని గెలుచుకున్న‌ది.

Sun, 07 Aug 202210:20 AM IST

బ్యాడ్మింట‌న్ సింగిల్స్ లో ఫైన‌ల్‌కు చేరుకున్న పీవీ సింధు

బ్యాడ్మింట‌న్ ఉమెన్స్ సింగిల్స్‌లో ఇండియా స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. ఆదివారం సింగ‌పూర్ ప్లేయ‌ర్ యో జియా మిన్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్‌లో పీవీ సింధు 21-19 21-17 తేడాతో విజ‌యాన్ని సాధించింది.

Sun, 07 Aug 202208:50 AM IST

ఆధిక్యంలో ఇండియా ఉమెన్స్ హకీ టీమ్

న్యూజిలాండ్ తో జరుగుతున్న బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో హాఫ్ టైమ్ ముగిసే సమయానికి ఇండియా ఉమెన్స్ హకీ టీమ్ 1 0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సలీమా గోల్ తో ఇండియా లీడ్ లోకి చేరుకున్నది.

Sun, 07 Aug 202209:51 AM IST

టీ20 క్రికెట్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ దక్కేనా

కామన్వెల్త్ గేమ్స్ లో టీ20 క్రికెట్ లో అద్వితీయ ఆటతీరుతో భారత ఉమెన్స్ జట్టు ఫైనల్ చేరుకున్నది. నేడు ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తుది పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఆ ఓటమికి నేడు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించేందుకు హర్మన్ ప్రీత్ సేన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

Sun, 07 Aug 202207:21 AM IST

కామన్వెల్త్ గేమ్స్ లో 10వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే

అథ్లెటిక్స్ ‍- పారా అథ్లెటిక్స్

మెన్స్ ట్రిపుల్ జంప్ (మధ్యాహ్నం 2.45 )

అబ్దుల్లా అబూబాకర్, ఎల్డోస్ పాల్, ప్రవీన్ చిట్రివేల్

మెన్స్ 10000 మీటర్ల రేజ్ వాక్ ఫైనల్ (మధ్యాహ్నం 3.50)

సందీప్ కుమార్

ఉమెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (సాయంత్రం 4.05)

శిల్ప రాణి, అన్నూ రాణి

ఉమెన్స్ 4 *100 రిలే ఫైనల్ (సాయంత్రం 5.24)

మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (ఆదివారం అర్థరాత్రి)

రోహిత్ యాదవ్, డీపీ మను

మెన్స్ 4 * 100 రిలేజ్ ఫైనల్ ఆదివారం అర్ధరాత్రి

బ్యాడ్మింటన్

ఉమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 2.20)

పీవీ సింధు

మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10)

లక్ష్య సేన్

మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10)

కిదాంబి శ్రీకాంత్

బాక్సింగ్

ఉమెన్స్ 48 కేజీలు ఫైనల్(మధ్యాహ్నం 3 గంటలకు) - నీతు

మెన్స్ 51 కేజీలు ఫైనల్ మధ్యాహ్నం 3.15 - అమిత్ పంగల్

ఉమెన్స్ 50 కేజీలు ఫైనల్ రాత్రి 7 గంటలకు - నిఖత్ జరీన్

క్రికెట్

ఉమెన్స్ టీ20 ఫైనల్

స్క్వాష్

మిక్స్ డ్ డబుల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (రాత్రి 10.30)

దీపిక పల్లికల్, సౌరభ్ ఘోషల్

హాకీ

ఉమెన్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.30 నుంచి)

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

టేబుల్ టెన్నిస్, పారా టేబుల్ టెన్నిస్

ఉమెన్స్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35)

శ్రీజ ఆకుల

మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 6.15)

ఆచంట శరత్ కమల్, జి సత్యన్

మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్

ఆచంట శరత్ కమల్

మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్

జి.సత్యన్

మిక్స్ డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (ఆదివారం అర్ధరాత్రి )

ఆచంట శరత్ కమల్, శ్రీజ ఆకుల