తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Vs Tilak: ఇంత స్వార్థం పనికి రాదు.. సిగ్గులేని కెప్టెన్: తిలక్‌ను హాఫ్ సెంచరీ చేయనీయని హార్దిక్‌పై విమర్శలు

Hardik vs Tilak: ఇంత స్వార్థం పనికి రాదు.. సిగ్గులేని కెప్టెన్: తిలక్‌ను హాఫ్ సెంచరీ చేయనీయని హార్దిక్‌పై విమర్శలు

Hari Prasad S HT Telugu

09 August 2023, 7:22 IST

google News
    • Hardik vs Tilak: ఇంత స్వార్థం పనికి రాదు.. సిగ్గులేని కెప్టెన్ అంటూ హార్దిక్ పాండ్యాపై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయనీయకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తిలక్ ఫిఫ్టీని అడ్డుకున్న హార్దిక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు
తిలక్ ఫిఫ్టీని అడ్డుకున్న హార్దిక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు (AFP)

తిలక్ ఫిఫ్టీని అడ్డుకున్న హార్దిక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు

Hardik vs Tilak: వెస్టిండీస్ పై మూడో టీ20 మ్యాచ్ లో ఇండియా గెలిచినా కూడా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం అతడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయకుండా అడ్డుకోవడమే. వరుసగా మూడో మ్యాచ్ లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్.. ఈ మ్యాచ్ లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మ్యాచ్ లో అప్పటికే రెండు ఓవర్లు మిగిలి ఉండటం.. తిలక్ హాఫ్ సెంచరీకి ఒకే పరుగు అవసరం అని తెలిసినా కూడా హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించడం అభిమానులకు రుచించడం లేదు. దీంతో హార్దిక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మొదట సులువుగా గెలిచే మ్యాచ్ లో సంజూ శాంసన్ కంటే ముందు బ్యాటింగ్ కు వచ్చాడని, తర్వాత తిలక్ హాఫ్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడని వాళ్లు ఆరోపిస్తున్నారు.

హార్దిక్.. మరీ ఇంత స్వార్థమా?

హార్దిక్ పాండ్యాలాంటి స్వార్థం కలిగిన ప్లేయర్, కెప్టెన్ ఇంత వరకూ ఇండియన్ టీమ్ చూడలేదని ఫ్యాన్స్ అంటున్నారు. మ్యాచ్ తర్వాత వాళ్లు వరుస ట్వీట్లు చేశారు. ఈ మ్యాచ్ 18వ ఓవర్ 4వ బంతికి తిలక్ వర్మ సింగిల్ తీశాడు. అప్పటికి అతడు 37 బంతుల్లో 49 పరుగులతో ఉన్నాడు. ఆ ఓవర్లో మరో రెండు బంతులు మిగిలి ఉండటం, విజయానికి ఇండియాకు 2 పరుగులు అవసరం కావడంతో తిలక్ కు ఫిఫ్టీ చేసే ఛాన్స్ హార్దిక్ ఇస్తాడని అందరూ భావించారు.

కానీ అతడు మాత్రం ఐదో బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. ఆ సమయంలో అలా చేయాల్సిన అవసరం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఓ యువ బ్యాటర్ కు ఆ అవకాశం ఇచ్చి హీరో అయ్యే అవకాశం ఉన్నా హార్దిక్ అలా చేయలేదు. ఇండియా ఇప్పటి వరకూ చూడని సిగ్గు లేని కెప్టెన్ అని ఒకరు.. ఇంత స్వార్థపరమైన ప్లేయర్, కెప్టెన్ ను చూడలేదని మరొకరు విమర్శించారు.

కొందరు ఒకప్పుడు కోహ్లి సెంచరీ కోసం ధోనీ వ్యవహరించిన తీరును, ఐపీఎల్లో యశస్వి సెంచరీ కోసం సంజూ శాంసన్ ఓ వైడ్ బాల్ ను ఆడటాన్ని ప్రస్తావించారు. విండీస్ సిరీస్ తొలి టీ20లో ఇండియా తరఫున అరంగేట్రం చేసిన తిలక్.. మూడు మ్యాచ్ లలోనూ అదరగొట్టాడు. తొలి మ్యాచ్ లో 25 బంతుల్లో 39, రెండో మ్యాచ్ లో 51, మూడో మ్యాచ్ లో 49 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి మూడు టీ20 ఇన్నింగ్స్ లో 30కిపై పరుగులు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ గా తిలక్ నిలిచాడు. గతంలో సూర్యకుమార్ కూడా ఈ ఘనత సాధించాడు.

తదుపరి వ్యాసం