Hardik Pandya : బ్యాట్స్‌మెన్‌కు బాధ్యత ఉండాలి.. హార్దిక్ పాండ్యా విమర్శలు-cricket news batsmens need to take responsibility says captain hardik pandya ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya : బ్యాట్స్‌మెన్‌కు బాధ్యత ఉండాలి.. హార్దిక్ పాండ్యా విమర్శలు

Hardik Pandya : బ్యాట్స్‌మెన్‌కు బాధ్యత ఉండాలి.. హార్దిక్ పాండ్యా విమర్శలు

Anand Sai HT Telugu
Aug 07, 2023 08:08 AM IST

IND Vs WI 2nd T20 : వెస్టిండీస్‌తో జరిగిన 2వ టీ20లో భారత్ ఓటమిపాలైంది. బ్యాట్స్‌మెన్‌పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శలు చేశాడు.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా (Getty)

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు మళ్లీ 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టు 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది.

వెస్టిండీస్‌పై భారత్‌ వరుసగా 2 టీ20ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. వెస్టిండీస్ స్టార్ ఆటగాడు పురన్ చర్యే భారత జట్టు ఓటమికి కారణమైంది. బాగా ఆడిన పురన్ 40 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 67 పరుగులు చేశాడు.

ఈ ఓటమి గురించి భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ 'నిజం చెప్పాలంటే, మా జట్టు బ్యాటింగ్ బాగా లేదు. ఈ పిచ్‌పై 170 పరుగులు మెరుగైన లక్ష్యంగా ఉండేది. నికోలస్ పూరన్ అద్భుతమైన బ్యాటింగ్ తో స్పిన్నర్లను ఉపయోగించవలసి వచ్చింది. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా.. తన యాక్షన్ తో ఆటను వెస్టిండీస్ కు అనుకూలంగా మార్చుకున్నాడు.' అని చెప్పుకొచ్చాడు హార్దిక్.

'ప్రస్తుత బ్యాటింగ్ కాంబినేషన్‌లో ఉన్న భారత జట్టులో టాప్ 7 బ్యాట్స్‌మెన్ బాగా ఆడాలి. మంచి టార్గెట్ ఇస్తేనే విజయం వస్తుంది. బ్యాట్స్‌మెన్ బాధ్యతను గ్రహించి ఆడాలని నేను భావిస్తున్నాను. తిలక్ వర్మ విషయానికొస్తే, అతను 2వ ఇంటర్నేషనల్‌లో ఆడినా బాగా ఆడాడు. ఇది నేర్చుకోవలసిన సమయం అని నేను భావిస్తున్నాను. తదుపరి మ్యాచ్‌ల్లో రాణిస్తాం.' అని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

టీమిండియా వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. వెస్టిండీస్‍తో జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు ఓటమి పాలైంది. విండీస్ చేతిలో భారత్ వరుసగా రెండు అంతర్జాతీయ మ్యాచ్‍లు ఓడిపోవడం 12 ఏళ్లలో ఇదే తొలిసారి. గయానా వేదికగా ఆగస్టు 6న జరిగిన రెండో టీ20లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో పరాజయం చెందింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‍లో వెస్టిండీస్ 2-0తో ఆధిక్యాన్ని పెంచుకుంది.

Whats_app_banner