తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin On Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో తనకు చోటు దక్కకపోవడంపై అశ్విన్ తొలి రియాక్షన్ ఇదీ

Ashwin on WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో తనకు చోటు దక్కకపోవడంపై అశ్విన్ తొలి రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu

16 June 2023, 10:37 IST

google News
    • Ashwin on WTC Final: విదేశాల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాను.. అయినా ఇలా ఎందుకు చేశారో అంటూ డబ్ల్యూటీసీ ఫైనల్లో తనను పక్కన పెట్టడంపై అశ్విన్ తొలిసారి స్పందించాడు.
రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ (Action Images via Reuters)

రవిచంద్రన్ అశ్విన్

Ashwin on WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారి స్పందించాడు. ఈ ఫైనల్లో పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలించేలా ఉందంటూ అశ్విన్ ను పక్కన పెట్టి, నాలుగో పేస్ బౌలర్ ను తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గవాస్కర్, సచిన్, రవిశాస్త్రిలాంటి మాజీలు తీవ్రంగా స్పందించారు. అయితే ఇన్నాళ్లూ దీనిపై సైలెంట్ గా ఉన్న అశ్విన్.. తొలిసారి రియాక్టయ్యాడు.

తాను విదేశాల్లో బాగానే బౌలింగ్ చేస్తున్నానని, గత ఫైనల్లోనూ 4 వికెట్లు తీశానని అశ్విన్ చెప్పాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడాడు. "ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే కదా? ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిపోయిన తర్వాత దీనిపై మాట్లాడుతున్నాం. ఆ మ్యాచ్ ఆడాలని ఎంతో ఆశపడ్డాను. జట్టు ఫైనల్ చేరడంలో నా వంతు పాత్ర కూడా పోషించాను. నిజానికి గత ఫైనల్లోనూ నేను చాలా బాగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాను" అని అశ్విన్ అన్నాడు.

"2018-19 నుంచి విదేశాల్లో నా బౌలింగ్ అద్భుతంగా ఉంది. జట్టును గెలిపించడంలో నేను విజయవంతమయ్యాను. ఓ కోచ్ లేదా కెప్టెన్ కోణంలో దీనిని చూస్తున్నాను. వాళ్ల నిర్ణయాన్ని అర్థం చేసుకోగలను. చివరిసారి మేము ఇంగ్లండ్ వెళ్లినప్పుడు సిరీస్ 2-2త సమమైంది. అందుకే ఇంగ్లండ్ ల 4 పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్ బాగుంటుందని వాళ్లు భావించి ఉండొచ్చు.

ఫైనల్లో వాళ్లు అలాగే ఆలోచించి ఉండొచ్చు. స్పిన్నర్ తో సమస్య ఏంటంటే.. నాలుగో ఇన్నింగ్స్ లోనే బాగా ప్రభావం చూపగలడు. నాలుగో ఇన్నింగ్స్ చాలా కీలకం. అందులో డిఫెండ్ చేసుకోవడానికి తగినన్ని పరుగులు ఉంటే స్పిన్నర్ ప్రభావం చూపగలడు అనుకుంటారు. అందుకే ఇది మైండ్‌సెట్ కు సంబంధించిన విషయం" అని అశ్విన్ అన్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులోకి తీసుకోకపవడాన్ని తప్పుబడుతూ తనకు మద్దతుగా నిలిచిన మాజీ క్రికెటర్లకు అశ్విన్ థ్యాంక్స్ చెప్పాడు. అయితే టీమ్ కు ఐసీసీ టైటిల్ సాధించి పెట్టే అవకాశాన్ని కోల్పోయానని అతడు అన్నాడు. "నాకు మద్దతుగా మాజీ క్రికెటర్లు మెసేజ్ పంపిస్తే నేను వెంటనే స్పందించాను.

ఓ యువకుడిగా ఉన్నప్పుడు సీనియర్లను నేను అలా చూశాను. నేను ఆడితే బాగుంటుందని వాళ్లు అనుకోవడం నాకు సంతోషంగా ఉంది. కానీ నాకు ఆడే అవకాశం రాలేదు. నాకు ఆ విషయం 48 గంటల ముందే తెలుసు. దీంతో టైటిల్ గెలవడంలో జట్టుకు నేను ఎలా సాయపడగలను అనే విషయంపై ఆలోచించాను" అని అశ్విన్ చెప్పాడు.

తదుపరి వ్యాసం