తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Argentina Coach On Messi: మారడోనా కంటే మెస్సీయే గొప్పోడు: అర్జెంటీనా కోచ్‌ స్కలోని

Argentina Coach on Messi: మారడోనా కంటే మెస్సీయే గొప్పోడు: అర్జెంటీనా కోచ్‌ స్కలోని

Hari Prasad S HT Telugu

17 January 2023, 17:44 IST

    • Argentina Coach on Messi: మారడోనా కంటే మెస్సీయే గొప్పోడని అన్నాడు అర్జెంటీనా కోచ్‌ లియోనెల్‌ స్కలోని. వరల్డ్‌ కప్‌ గెలిచిన అర్జెంటీనా టీమ్‌కు స్కలోని కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీతో మెస్సీ, స్కలోని
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీతో మెస్సీ, స్కలోని (AFP)

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీతో మెస్సీ, స్కలోని

Argentina Coach on Messi: సమకాలీన ఫుట్‌బాల్‌లో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సీలు దీనికోసం పోటీ పడుతున్నారు. అయితే తాజాగా అర్జెంటీనా వరల్డ్‌కప్‌ గెలవడంతో రొనాల్డో కంటే మెస్సీయే గొప్ప అని ఫ్యాన్స్‌ తేల్చేశారు. అంతేకాదు అసలు ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాలర్‌ మెస్సీ అని అనేవాళ్లు కూడా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తాజాగా అర్జెంటీనా కోచ్‌ లియోనెల్‌ స్కలోనీ అయితే అర్జెంటీనా దిగ్గజ ప్లేయర్‌ డీగో మారడోనా కంటే మెస్సీయే గొప్పోడని తేల్చేశాడు. "ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలంటే నేను మెస్సీనే అంటాను. అతనితో నాకు ప్రత్యేక బంధం ఉంది. మెస్సీయే ఆల్‌టైమ్‌ బెస్ట్‌ ప్లేయర్‌. మారడోనా కూడా గ్రేటే కానీ మెస్సీయే అతని కంటే గొప్ప" అని స్కలోని చెప్పాడు.

1986లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన మారడోనానే మెస్సీ కంటే గొప్పోడని అర్జెంటీనియన్లు చాలా ఏళ్లుగా చెబుతూ వస్తున్నారు. కానీ తాజాగా మెస్సీ కూడా తన టీమ్‌ను మూడోసారి విశ్వవిజేతగా చేయడంతో మారడోనా స్థానాన్ని ఆక్రమించేశాడు. మెస్సీకి ప్రత్యేకంగా కోచింగ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు మాత్రం కొన్ని సూచనలు చేస్తే చాలని కోచ్‌ స్కలోని చెప్పాడు.

"నేను 2018లో కోచ్‌ అవగానే మొదటిగా చేసిన పని మెస్సీతో వీడియో కాల్‌ మాట్లాడటం. ఆ సమయంలో అతడు బ్రేక్‌ తీసుకుంటున్నాడు. తిరిగి రా.. నీ కోసం వేచి చూస్తున్నాను అని చెప్పాను. 8 నెలల తర్వాత అతడు తిరిగి వచ్చాడు. మెస్సీకి కోచింగ్‌ ఇవ్వడం కష్టం కాదు. సాంకేతికంగా అతన్ని సరి చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు మాత్రం కొన్ని సూచనలు ఇవ్వాల్సి వస్తుంది. అతడో నంబర్‌ వన్‌ ప్లేయర" అని స్కలోని స్పష్టం చేశాడు.