Fifa World Cup 2022 Winner Prize Money: ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ అర్జెంటీనాకు దక్కిన ప్రైజ్‌మ‌నీ ఎంతంటే-fifa world cup 2022 winner runner up prize money details ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 Winner Prize Money: ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ అర్జెంటీనాకు దక్కిన ప్రైజ్‌మ‌నీ ఎంతంటే

Fifa World Cup 2022 Winner Prize Money: ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ అర్జెంటీనాకు దక్కిన ప్రైజ్‌మ‌నీ ఎంతంటే

Nelki Naresh Kumar HT Telugu
Dec 19, 2022 11:15 AM IST

Fifa World Cup 2022 Winner Prize Money: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అర్జెంటీనా విన్న‌ర్‌గా నిలిచింది. అదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌పై విజ‌యాన్ని సాధించింది. విన్న‌ర్‌గా నిలిచిన అర్జెంటీనాకు ఎంత ప్రైజ్‌మ‌నీ ద‌క్కిందంటే...

అర్జెంటీనా టీమ్
అర్జెంటీనా టీమ్

Fifa World Cup 2022 Winner Prize Money: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజేత‌గా అర్జెంటీనా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో ఫ్రాన్స్‌పై విజ‌యాన్ని సాధించింది. స్టార్ ప్లేయ‌ర్ మెస్సీ అద్భుత ఆట‌తీరుతో విజ‌యాన్ని అందుకున్న అర్జెంటీనా మూడోసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.

కాగా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజేత‌గా నిలిచిన అర్జెంటీనా 42 మిలియ‌న్ డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీని ద‌క్కించుకున్న‌ది. ఇండియ‌న్ క‌రెన్సీలో 347 కోట్ల ప్రైజ్‌మ‌నీని అర్జెంటీనా సొంతం చేసుకున్న‌ది.

ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌కు 30 మిలియ‌న్ డాల‌ర్స్ అంటే 248 కోట్ల ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది.

మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియాకు 223 కోట్లు, నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్న మొరాకోకు 206 కోట్ల ప్రైజ్‌మ‌నీ అందింది.

క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో వెనుదిరిగిన జ‌ట్ల‌కు 138 కోట్లు

నాకౌట్ స్టేజ్‌కి వ‌చ్చిన జ‌ట్ల‌కు 106 కోట్లు

గ్రూప్ స్టేజ్‌లో ఆడిన ఒక్కో టీమ్‌కు 74 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్కింది. మొత్తంగా అన్ని టీమ్‌ల‌కు క‌లిపి 3660 కోట్ల ప్రైజ్‌మ‌నీని ఫిఫా అంద‌జేసింది.