Ronaldo Earnings: సౌదీ అరేబియా నుంచి రొనాల్డోకు భారీ మొత్తం.. అన్ని వేల కోట్లా?-cristiano ronaldo to earn 400 million euros in saudi arabia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ronaldo Earnings: సౌదీ అరేబియా నుంచి రొనాల్డోకు భారీ మొత్తం.. అన్ని వేల కోట్లా?

Ronaldo Earnings: సౌదీ అరేబియా నుంచి రొనాల్డోకు భారీ మొత్తం.. అన్ని వేల కోట్లా?

Ronaldo Earnings: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడు. మాంచెస్టర్ నుంచి విడిపోయి సౌదీ అరేబియా అల్ నసర్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న అతడు 400 మిలియన్ యూరోలు అందుకోనున్నాడు.

రొనాల్డో (AFP)

Ronaldo Earnings: గత నెలలో జరిగిన ఖతర్ ప్రపంచకప్‌ 2022 పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు చేదు జ్ఞాపకంగా మిగిలింది. కెరీర్‌లో దాదాపు అన్ని ట్రోఫీలు అందుకున్న రొనాల్డో.. తన దేశానికి ప్రపంచ కప్ తీసుకురావాలనే కలను మాత్రం సాకారం చేసుకోలేకపోయాడు. ఫలితంగా మైదానాలంనే కుమిలిపోయాడు. ఇదిలా ఉంటే మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా అతడిని వదిలేసుకుంది. వరుసగా ఈ షాక్‌లు తగిలినప్పటికీ.. ఇప్పడు రొనాల్డోకు అదిరిపోయే ఆఫర్ దక్కించుకున్నాడు. 400 మిలియన్ యూరోలను(రూ.3 వేల 529 కోట్ల) సంపాదించనున్నాడు.

మాంచెస్టర్ అతడిని వదిలేసుకుంటే సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ రొనాల్డోను తీసుకుంది. అల్ నసర్ క్లబ్ తరఫున అతడు ఆడినందుకు గానూ.. 200 మిలియన్ యూరోలను(రూ.1764 కోట్లు) అతడికి ఇవ్వనుంది. ఇక్కడితో అయిపోలేదు. 2030 వరల్డ్ కప్ హోస్టే చేసేందుకు సౌదీ అరేబియా కూడా బిడ్ వేయాలనుకుంటోంది. దీంతో ఈ టోర్నీ తమ రాయబారిగా ఉండేందుకు రొనాల్డోకు అదనంగా మరో 200 మిలియన్ యూరోలను ఇవ్వనున్నట్లు సమాచారం.

"అల్ నసర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో రొనాల్డో 200 మిలియన్ యూరోలకు ఒప్పందం చేసుకున్నాడు. అంతేకాకుండా 2030 వరల్డ్ కప్ బిడ్ కోసం సౌదీ అరేబియా అంబాసిడర్‌గా ఉంటే మరో 200 మిలియన్ డాలర్లను అందుకోనున్నాడు." అని ఫుట్‌బాల్ వర్గాలు తెలిపాయి.

ఐదు సార్లు బాలన్ డీ ఓర్ విజేతగా నిలిచిన రొనాల్డో.. ఐదు సార్లు ఛాంపియన్ లీగ్‌ను గెల్చుకున్నాడు. అంతేకాకుండా టోర్నీలో అత్యుత్తమ గోల్ స్కోరును కలిగి ఉన్నాడు. మాంచెస్టర్ నుంచి విడిపోయిన తర్వాత అల్ నసర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అతడు జనవరి 22న ఆ జట్టు తరఫున అరంగేట్రం చేయబోతున్నాడు. ఇందుకోసం భారీ మొత్తంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందానికి సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనం

టాపిక్