Ronaldo sister Katia Aveiro on fifa world cup: ఇదో చెత్త వరల్డ్‌ కప్‌ అంటున్న రొనాల్డో సోదరి.. ఇదీ కారణం-ronaldo sister katia aveiro on fifa world cup says its worst of all time ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ronaldo Sister Katia Aveiro On Fifa World Cup: ఇదో చెత్త వరల్డ్‌ కప్‌ అంటున్న రొనాల్డో సోదరి.. ఇదీ కారణం

Ronaldo sister Katia Aveiro on fifa world cup: ఇదో చెత్త వరల్డ్‌ కప్‌ అంటున్న రొనాల్డో సోదరి.. ఇదీ కారణం

Hari Prasad S HT Telugu
Dec 20, 2022 10:01 PM IST

Ronaldo sister Katia Aveiro on fifa world cup: ఇదో చెత్త వరల్డ్‌ కప్‌ అంటోంది రొనాల్డో సోదరి కాటియా అవీరో. ఫిపా వరల్డ్‌కప్‌ 2022పై తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (AP)

Ronaldo sister Katia Aveiro on fifa world cup: పోర్చుగల్ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో సోదరి కాటియా అవీరో గత ఆదివారం ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇదే అత్యంత చెత్త వరల్డ్‌కప్‌ అని ఆమె అనడం గమనార్హం. అయితే అలాంటి టోర్నీ కూడా ఓ గొప్ప ఫైనల్‌ మ్యాచ్‌ను అందించిందని అభిప్రాయపడింది.

అర్జెంటీనా టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూనే.. ఆ టీమ్‌ మెస్సీని కాదని ఫ్రాన్స్‌ ప్లేయర్‌ ఎంబాపేపై ప్రశంసలు కురిపించింది. "ఇప్పటి వరకూ జరిగిన అత్యంత చెత్త వరల్డ్‌కప్‌.. అయితే అదృష్టవశాత్తూ ఓ గొప్ప ఫైనల్‌ను అందించింది. ఏం మ్యాచ్‌ అది. అర్జెంటీనాకు శుభాకాంక్షలు" అని అవీరో తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసింది.

ఇక 8 గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ అవార్డు గెలుచుకున్న ఫ్రాన్స్‌ ప్లేయర్‌ ఎంబాపెపై ప్రశంసలు కురిపించింది. "కిలియన్‌ ఎంబాపె. ఇతడో ఊహకందని ప్లేయర్‌. అతని కోసం గొప్ప భవిష్యత్తు ఎదురు చూస్తోంది. అద్భుతం" అని అవీరో కొనియాడింది.

అయితే తన తమ్ముడి ప్రత్యర్థి, గోల్డెన్‌ బాల్ విజేత అయిన మెస్సీ పేరును మాత్రం ఆమె ప్రస్తావించలేదు. రొనాల్డోకు ఈ ఏడాది వరల్డ్‌కప్‌ అస్సలు కలిసి రాలేదు. టోర్నీ ప్రారంభమైన మొదట్లోనే తన క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌పై అతడు విమర్శలు చేయడం, కొన్నాళ్లకే ఆ క్లబ్‌ అతన్ని సాగనంపడం తెలిసిందే. ఆ తర్వాత పోర్చుగల్‌ టీమ్‌తోనూ రొనాల్డోకు పడలేదు.

కీలకమైన మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టడం, ఆ తర్వాత అతడు వరల్డ్‌కప్‌ను వదిలి వెళ్తున్నట్లు వార్తలు రావడం సంచలనం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో పోర్చుగల్ టీమ్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆ సమయంలో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఫ్రీ ఏజెంట్‌గా ఉన్న రొనాల్డో.. ఏ క్లబ్‌ తరఫున ఆడతాడన్నది ఆసక్తిగా మారింది.

Whats_app_banner