Lionel Messi with World cup trophy in bed: వరల్డ్‌కప్‌ ట్రోఫీని పట్టుకొనే నిద్రపోయిన మెస్సీ.. ఫొటో వైరల్‌-lionel messi with world cup in bed as the photo gone viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Lionel Messi With World Cup In Bed As The Photo Gone Viral

Lionel Messi with World cup trophy in bed: వరల్డ్‌కప్‌ ట్రోఫీని పట్టుకొనే నిద్రపోయిన మెస్సీ.. ఫొటో వైరల్‌

Hari Prasad S HT Telugu
Dec 20, 2022 08:00 PM IST

Lionel Messi with World cup Trophy in bed: వరల్డ్‌కప్‌ ట్రోఫీని పట్టుకొనే నిద్రపోయాడు అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ. ఇప్పుడీ ఫొటో తెగ వైరల్‌ అవుతోంది.

వరల్డ్ కప్ ట్రోఫీని పక్కన పెట్టుకొని పడుకున్న లియోనెల్ మెస్సీ
వరల్డ్ కప్ ట్రోఫీని పక్కన పెట్టుకొని పడుకున్న లియోనెల్ మెస్సీ

Lionel Messi with World cup Trophy in bed: ఒకటీ, రెండు కాదు.. ఎన్నో ఏళ్ల పాటు వరల్డ్‌కప్‌ ట్రోఫీ కోసం ఎదురు చూశాడు అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ. 2014లో ఓసారి ఫైనల్లో ఓడిపోయిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వచ్చాడు. 2018లో మరోసారి కల చెదిరింది. 2022లో మాత్రం మొత్తానికి తాను అనుకున్నది సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతుల్లో ఓడిపోయిన అర్జెంటీనా.. చివరికి విశ్వ విజేతగా నిలవడం నిజంగా ఓ అద్భుతమే. ఈ జైత్రయాత్రలో మెస్సీ పాత్రే కీలకం. టోర్నీ మొత్తంలో ఏడు గోల్స్‌ చేసిన అతడు.. గోల్డెన్‌ బాల్‌ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డు కంటే కూడా ఎన్నో ఏళ్ల కల, తన జీవిత లక్ష్యం నెరవేరిన ఆనందం మెస్సీ కళ్లలో స్పష్టంగా కనిపించింది.

ఇన్నాళ్లుగా తాను దేని కోసమైతే పరితపించాడో ఇప్పుడదే ట్రోఫీ చేతికి అందడంతో మెస్సీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ట్రోఫీని అతడు అసలు వదలడం లేదు. ఎంతలా అంటే.. రాత్రి పడుకునే సమయంలోనూ ఈ ట్రోఫీని పక్కనే పెట్టుకొని పడుకోవడం విశేషం. ఈ ఫొటోను మెస్సీయే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇప్పుడీ ఫొటో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో మెస్సీ వరల్డ్‌కప్‌ ట్రోఫీని గట్టిగా పట్టుకొని పడుకోవడం చూడొచ్చు. వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత మెస్సీ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రొనాల్డో రికార్డును బ్రేక్‌ చేస్తూ మెస్సీ చేసిన ఈ పోస్ట్‌ ఆరు కోట్ల వరకూ లైక్స్‌ సంపాదించడం విశేషం. ఇక ఈ తాజా పోస్ట్‌ కూడా మూడు కోట్ల వరకూ లైక్స్‌ సంపాదించడం విశేషం.

ఆదివారం రాత్రి వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన తర్వాత మెస్సీ సేన మంగళవారం తెల్లవారుఝామున స్వదేశానికి చేరింది. అక్కడ వేల సంఖ్యలో అభిమానులు తమ టీమ్‌కు ఘన స్వాగతం పలికారు. ఆ టీమ్‌ ప్లేయర్స్‌ ఓపెన్‌ టాప్‌ బస్‌పై ఊరేగింపుగా వెళ్లారు. అర్జెంటీనా టీమ్‌ 36 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌ను ముచ్చటగా మూడోసారి గెలిచిన విషయం తెలిసిందే. 1986లో చివరిసారి మారడోనా కెప్టెన్సీలో.. ఇప్పుడు మెస్సీ కెప్టెన్సీలో ఆ టీమ్‌ విశ్వవిజేతగా నిలిచింది.

WhatsApp channel