Tulasi plant: తులసి మొక్కను పొరపాటున కూడా ఈ ఐదు ప్రదేశాలలో పెట్టకూడదు, అశుభం
30 August 2024, 8:34 IST
- Tulasi plant: పవిత్రమైన తులసి మొక్కను పెట్టుకునేందుకు వాస్తు ప్రకారం కొన్ని దిశలు ఉన్నాయి. కానీ దీన్ని పొరపాటున కూడా ఇంట్లోని ఈ ఐదు ప్రదేశాలలో పెట్టకూడదు. ఇది అశుభ పరిణామాలు ఇస్తుంది. ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించేలా చేస్తుంది.
తులసి మెుక్క
Tulasi plant: హిందూ మతంలో తులసి మొక్క ఆధ్యాత్మిక పెరుగుదల, స్వచ్ఛత, దైవిక ప్రేమకు పవిత్రమైన చిహ్నంగా పరిగణిస్తారు. లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు. దీని శుద్ధి చేసే లక్షణాలు, ఔషధ గుణాలు కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నిత్యం తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శ్రేయస్సు, సౌభాగ్యం, రక్షణ లభిస్తాయని నమ్ముతారు.
తులసి ఉన్న ఇంట్లో వారి మనసు, శరీరం, ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. నిత్యం తులసి ఆరాధన చేసే వారికి మరణం తర్వాత మోసం లభిస్తుందని చెబుతారు. పాపాలు నశిస్తాయని ప్రతీతి. అత్యంత పూజనీయమైన మొక్కగా తులసిని ఆరాధిస్తారు. అయితే అటువంటి పవిత్రమైన తులసి మొక్కను కొన్ని ప్రదేశాలలో ఉంచుకోకూడదు. తులసి మొక్కను ఉంచడం అశుభకరంగా భావించే ఐదు ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో ఎక్కడ పెట్టినా ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. అందువల్ల పొరపాటున కూడా తులసి మొక్కను ఈ స్థానాల్లో ఉంచుకోకూడదు.
బాత్రూమ్
తులసిని బాత్రూమ్ లేదా టాయిలెట్ దగ్గర ఉంచకూడదు. దీని పవిత్రమైన స్వభావం అపవిత్రంగా మారుతుంది. వ్యర్ధాలు మలినాలతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, సురక్షితను దెబ్బతీస్తుంది. అది మాత్రమే కాకుండా ఇటువంటి ప్రదేశంలో తులసి మొక్కను ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
వంటగది
హిందూ శాస్త్రం ప్రకారం తులసిని ఎప్పుడూ వంటగది దగ్గర ఉంచకూడదు. ఎందుకంటే వేడి, పొగ, వంట వాసనలు పవిత్రతను కలుషితం చేస్తాయని నమ్ముతారు. దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తగ్గించి శుద్ధి చేసే లక్షణాలను తొలగిస్తుంది. అందువల్ల పూజా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది అశుభకారంగా భావిస్తారు. అందుకే వంట గది పరిసర ప్రాంతాల్లోనూ దీన్ని ఉంచుకోకూడదు.
మెట్ల కింద పెట్టకూడదు
తులసిని ఎప్పుడూ మెట్ల కింద లేదా నేల మీద పెట్టకూడదు. ఇది సానుకులు శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల, శ్రేయస్సు, అదృష్టాన్ని నిలిపివేస్తుంది. ఇంట్లో ఇబ్బందికరమైన పరిణామాలను కలిగిస్తుంది.
చెప్పుల ఉంచే ప్రదేశం
తులసిని చెప్పులు, డస్ట్ బిన్ ఉంచే మురికి ప్రదేశాల దగ్గర ఉంచకూడదు. ఎందుకంటే పాదరక్షలు నుంచి వచ్చే దుమ్ము, మలినాలు, ప్రతికూల శక్తులు తులసి పవిత్ర శక్తులు కలుషితం చేస్తాయి. దాని అధ్యాత్మికతను తగ్గిస్తాయి. అందుకే తులసిని ఎప్పుడు ఎత్తైన ప్రదేశంలో కుండీలో మాత్రమే ఉంచుకోవాలి.
పడకగది
తులసిని ఎప్పుడూ బెడ్ రూమ్ కి దగ్గర లేదా పడకగదిలో ఉంచుకోరాదు. ఎందుకంటే దాన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి సాన్నిహిత్యానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. ఇది చంచలతను కలిగిస్తుంది. దీని ఉనికి ధ్యానం, అధ్యాత్మికతను ప్రోత్సహిస్తుంది. అందుకే పూజ గదిలో నిర్మలమైన ప్రదేశాలు ఈ మొక్క పెట్టేందుకు అనువైనదిగా చెబుతారు.
వాస్తు ప్రకారం తులసిని అనుచితమైన ప్రదేశాలలో ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది. ఇది జీవితంలో దురదృష్టం, అడ్డంకులను తీసుకురాగలదు. అందుకే తులసి సరైన స్థలంలో ఉంచుకోవాలి. అప్పుడే ఆరోగ్యం, సంపదను ప్రభావితం చేస్తుంది.
తులసిని సరైన స్థలంలో ఉంచకపోతే ఇంట్లోకి ప్రతికూల శక్తులు ఎక్కువగా ప్రవేశిస్తాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రం మార్గాలను అనుసరించి మరిన్ని ప్రయోజనాలు పొందటం కోసం, జీవితంలో సామరస్యాన్ని కొనసాగించేందుకు సరైన స్థానంలో ఉంచడం మంచిది. అప్పుడే జీవితంలో ఆధ్యాత్మిక పెరుగుదల, శ్రేయస్సు నిండి ఉంటుంది.
టాపిక్