డస్ట్ బిన్ ఈ దిశలో పెడితే జేబులు ఖాళీ అవుతాయ్ జాగ్రత్త!
unsplash
By Gunti Soundarya Aug 16, 2024
Hindustan Times Telugu
ప్రతి ఒక్కరి ఇంట్లో డస్ట్ బిన్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే దాన్ని ఎక్కడంటే అక్కడ మాత్రం పెట్టకూడదు.
pixabay
డస్ట్ బిన్ పెట్టేందుకు వాస్తు నియమాలు ఉన్నాయండోయ్. సరైన దిశలో పెట్టకపోతే మీ జేబులకు చిల్లు పడటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
pixabay
వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో చెత్తబుట్టలు పెట్టకూడదు. అలా చేస్తే ధన నష్టం పెరిగి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు. చేతిలో డబ్బు నిలవదు.
pixabay
ఇంటి ఆగ్నేయ దిశలో డస్ట్ బిన్ పెడుతుంటే వెంటనే దాన్ని తొలగించేయండి. లేదంటే మీరు ఏదైనా పని తలపెడితే అనేక అడ్డంకులు ఎదురవుతాయి.
pixabay
ఇంటి ఉత్తర దిశలో డస్ట్ బిన్ ఉంచడం శుభప్రదంగా పరిగణించబడదు. దీని వల్ల ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు.
pixabay
వాస్తు ప్రకారం దుమ్ము ధూళిని ఇంటి పడమర దిశలో ఉంచకూడదు. దీని వల్ల చేసే పనులన్నింటిలోను ఆటంకాలు ఏర్పడతాయి.
pinterest
వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిశలో డస్ట్ బిన్ పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా చేస్తే డబ్బు ఇంట్లో నిలవదు. తరచూ నెగటివ్ ఆలోచనలు కూడా వస్తాయట.
pixabay
ఇంటి డస్ట్ బిన్ పెట్టేందుకు ఎప్పుడు నైరుతి లేదా వాయువ్య దిశ ఎంచుకోవాలి. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.