తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karwa Chauth 2024: కర్వా చౌత్ నాడు మట్టి కుండతో చంద్రుడికి అర్ఘ్యాన్ని ఎందుకు సమర్పిస్తారు?

Karwa chauth 2024: కర్వా చౌత్ నాడు మట్టి కుండతో చంద్రుడికి అర్ఘ్యాన్ని ఎందుకు సమర్పిస్తారు?

Gunti Soundarya HT Telugu

17 October 2024, 13:29 IST

google News
    • Karwa chauth 2024: ఉత్తర భారతీయులు కర్వా చౌత్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. పెళ్ళైన స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోరుకుంటూ ఉపవాసం ఆచరిస్తారు. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. అయితే ఈ అర్ఘ్యం సమర్పించేందుకు మట్టి కుండను వినియోగిస్తారు ఎందుకో తెలుసా?
కర్వా చౌత్ 2024
కర్వా చౌత్ 2024

కర్వా చౌత్ 2024

హిందూ మతంలో కర్వా చౌత్ ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పెళ్లయిన మహిళలు ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం కర్వా చౌత్ ఉపవాసం 20 అక్టోబర్ 2024న వచ్చింది. 

స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కోసం ఈ రోజున నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఉత్తర భారతీయులు ఎక్కువగా జరుపుకుంటారు. మహిళలందరూ తమ భర్త క్షేమాన్ని కోరుకుంటూ పగలంతా ఉపవాసం ఉంటారు. రాత్రి చంద్రదేవుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు. చంద్రుడి వెలుగులో భర్త మొహాన్ని చూసి ఉపవాసం విరమించుకుంటారు. ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడానికి మట్టి కుండలను ఉపయోగిస్తారు. కర్వా చౌత్ రోజున చంద్రదేవుడికి జల అర్ఘ్యం ఇవ్వడానికి మట్టి కుండలను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు? ఇతర లోహ పాత్రలను ఎందుకు ఉపయోగించకూడదో తెలుసుకుందాం. 

మట్టి కుండ ఎందుకంటే 

పంచభూతాలైన నేల, నీరు, గాలి, అగ్ని, ఆకాశంతో సహా ఐదు మూలకాలతో ఈ మట్టి కుండను తయారు చేస్తారు. మానవ శరీరం కూడా ఐదు మూలకాలతో రూపొందించబడింది. ఇది స్వచ్ఛతకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు. మట్టిని నీటిలో నానబెట్టి దానితో కుండ తయారు చేస్తారు. దీని తరువాత అది గాలి, సూర్యకాంతి ద్వారా ఎండబెట్టబడుతుంది. నిప్పులో వండుతారు. ఈ విధంగా ఐదు అంశాల నుండి కుండ ఏర్పడుతుంది. 

అందువల్ల కర్వా చౌత్‌ల, అర్ఘ్యాన్ని మట్టి కుండతో సమర్పిస్తారు. దీని ఉపయోగం బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని తెస్తుందని, వైవాహిక జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషాన్ని తెస్తుందని ఒక మత విశ్వాసం. మట్టి కుండల ద్వారా నీరు సమర్పించే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. పురాణాల ప్రకారం సీతాదేవి,  ద్రౌపది కూడా కర్వా చౌత్ వ్రతాన్ని పాటించినప్పుడు వారు మట్టి కుండలను కూడా ఉపయోగించారు. అప్పటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. 

కర్వా చౌత్ పూజ ముహూర్తం 

అక్టోబర్ 20 ఆదివారం సాయంత్రం 7.57 గంటలకు చంద్రోదయం జరుగుతుంది. ప్రాంతాలను బట్టి చంద్రోదయం వేళల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఈ సమయంలో మహిళలు పూజలు చేస్తారు. మహిళలు రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రిపూట జల్లెడలో చంద్రుడి రూపాన్ని చూస్తూ తర్వాత భర్తను చూస్తూ నీళ్ళు తాగి ఉపవాసం విరమిస్తారు. 

చతుర్థి తిథి అక్టోబర్ 20 ఉదయం 6.46 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21 ఉదయం 4.16 గంటలకు ముగుస్తుంది. పూజకు శుభ సమయం అక్టోబర్ 20 సాయంత్రం 5.45 గంటల నుంచి 7.01 వరకు ఉంటుంది. ఈరోజు గ్రహాల కదలిక కూడా అద్భుతంగా ఉంది. శని కుంభంలో, బృహస్పతి వృషభ రాశిలో, శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ గ్రహాల పుణ్యఫలాల వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయి. ఈ సమయంలో పూజ చేయడం వల్ల భర్తకు అదృష్టం, ఆయుష్హు పెరుగుతుంది. ఎటువంటి ఆపద రాకుండా క్షేమంగా ఉంటారు. 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం