Sravana putrada ekadashi: శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత
14 August 2024, 16:28 IST
- Sravana putrada ekadashi: ఈసారి పుత్రద ఏకాదశి సందర్భంగా ప్రీతి యోగం యాదృచ్ఛికం జరుగుతోంది. శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులు ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్ట్ 16న వచ్చింది.
శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ శుభ ముహూర్తం
Sravana putrada ekadashi: పుత్రద ఏకాదశి సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది. ఇది పుష్య మాసంలో ఒకసారి శ్రావణ మాసంలో మరొకసారి వస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలో పుత్రద ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల సంతానం కల్గడంతో పాటు పిల్లలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయని చెబుతారు.
శ్రావణ పుత్రద ఏకాదశి అనేది పిల్లలను కోరుకునే జంటలు జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ. శ్రావణ పుత్రద ఏకాదశి అత్యంత గౌరవప్రదమైన రోజు. పిల్లల సంతోషాన్ని కోరుకునే దంపతులు ఈ రోజు తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి. పంచాంగం ప్రకారం సంతానం కలగాలనే కోరికతో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని పండితులు తెలిపారు. ఏకాదశి నాటి నుంచి ఉపవాసం ప్రారంభించి మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు దానిని విరమిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణు అనుగ్రహంతో కుటుంబంలో శ్రేయస్సు, సంతోషం పొందుతారు.
శ్రావణ పుత్రద ఏకాదశి 2024 తేదీ, శుభ ముహూర్తం
ఈ సంవత్సరం శ్రావణ పుత్రద ఏకాదశి ఆగస్ట్ 16, 2024న వచ్చింది. ఈరోజు ప్రీతి యోగంలో ఏకాదశి రావడం వల్ల దీని విశిష్టత మరింత రెట్టింపు అయ్యింది.
ఏకాదశి తిథి ప్రారంభం - ఆగస్ట్ 15న ఉదయం 10:26
ఏకాదశి తిథి ముగుస్తుంది - ఆగస్ట్ 16న ఉదయం 09:39
పరానా సమయం - ఆగస్ట్ 17వ తేదీ 05:28 AM నుండి 08:01 AM వరకు
ద్వాదశి ముగింపు క్షణం - 08:05 AM, ఆగస్ట్ 17
శ్రావణ పుత్రద ఏకాదశి 2024 ప్రాముఖ్యత
శ్రావణ పుత్రద ఏకాదశి హిందువులలో లోతైన మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ఏకాదశి తిథి నాడు ప్రారంభించి మరుసటి రోజు ద్వాదశి తిథితో ముగుస్తుంది. ప్రతి ఏకాదశి దాని స్వంత ప్రత్యేక కథ, ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పిల్లలు లేని వారికి శ్రావణ పుత్రద ఏకాదశి చాలా మంచిది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని భక్తులకు సంతానం లేదా పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. గర్భం దాల్చడానికి కష్టపడుతున్న వివాహిత జంటలు ఈ వ్రతాన్ని ఆచరించి భక్తిశ్రద్దలతో మహా విష్ణువును పూజిస్తారు.
పూజా విధానం
ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీ ఇంటిని ప్రత్యేకించి మీరు బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకునే ప్రాంతాన్ని శుభ్రం చేయండి. బలిపీఠంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచి దాని ముందు దేశీ నెయ్యితో నింపిన మట్టి దీపాన్ని వెలిగించండి.
ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. తులసి పత్రాన్ని సమర్పించండి. విగ్రహాన్ని పూలతో అలంకరించండి. చందనం పేస్ట్ తో తిలకం వేయండి. శ్రావణ పుత్రద ఏకాదశికి సంబంధించిన కథను పఠించాలి. మరుసటి రోజు, పారణ సమయంలో మీ ఉపవాసాన్ని విరమించండి.