తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navagraha Pidahara Stotram: నవగ్రహాలను శాంతింపజేసే నవగ్రహ పీడాహర స్తోత్రం.. ఇది పఠిస్తే దోషాల నుంచి విముక్తి

Navagraha pidahara stotram: నవగ్రహాలను శాంతింపజేసే నవగ్రహ పీడాహర స్తోత్రం.. ఇది పఠిస్తే దోషాల నుంచి విముక్తి

Gunti Soundarya HT Telugu

04 May 2024, 12:12 IST

    • Navagraha pidahara stotram: నవగ్రహాలు మానవ జీవితంపై ఏదో ఒక విధంగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటే వాటిని పోగొట్టుకునేందుకు ఈ నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. 
నవగ్రహ పీడాహర స్తోత్రం
నవగ్రహ పీడాహర స్తోత్రం (pinterest)

నవగ్రహ పీడాహర స్తోత్రం

Navagraha pidahara stotram: నవగ్రహ దోషాలు హరించి వేసే నవగ్రహ పీడాహర స్తోత్రం

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః|

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః||

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః|

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః||

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా|

వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః||

ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః|

సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః||

దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః|

అనేకశిష్య సంపూర్ణః పీడాం హరతు మే గురుః||

దైత్యమంత్రీ గురు స్తేషాం ప్రాణదశ్చ మహామతిః|

ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే బృగుః||

సూర్యపుత్రో దీర్ఘదేహొ విశాలాక్షః శివప్రియః|

మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః||

మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః|

అతనుశ్చోర్థ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ||

అనేకరూపవర్నై శతశోథ సహస్రశః|

ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః||

ఇతి నవగ్రహ పీడాహర స్తోత్రమ్||

నవగ్రహ పీడాహర స్తోత్రం ప్రయోజనాలు

నవగ్రహ దోషాల నుంచి రక్షించేందుకు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. వ్యక్తి జీవితం బాగుండాలంటే నవగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. నవగ్రహ పూజ స్తోత్రాలను వేదవ్యాసుడు రచించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

మనం చేపట్టే ఏ కార్యకలాపాలకైనా నవగ్రహాల అనుగ్రహం ఉంటేనే విజయం చేకూరుతుంది. అందుకోసం తప్పనిసరిగా ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఒక్కో గ్రహానికి సంబంధించి ఒక స్తోత్రం ఉంటుంది. అందులో ఆ గ్రహం గురించి వివరణ ఉంటుంది. గ్రహ స్థితి బాగోలేని వాళ్ళు, నవగ్రహ దోషాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఏ పని తలపెట్టిన కలిసి రాని వాళ్ళు నవగ్రహ స్తోత్రాలను పఠించడం ఉత్తమంగా పండితులు సూచిస్తున్నారు.

ఈ స్తోత్రాల్లో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, దేవ గురువు బృహస్పతి, శుక్రుడు, శని, రాహు కేతువుల గురించి ఉంటుంది. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించిన వాళ్ళు శక్తివంతులుగా మారతారు. స్త్రీ, పురుష భేదం లేకుండా ఎవరైనా ఈ నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి జరుగుతుంది. అంతులేని ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తుంది.

నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ఎలా?

గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం తప్పనిసరిగా నవగ్రహ విగ్రహాలను దర్శించుకుంటాం. వీటికి పూజ చేయడం వల్ల దోష పరిహారం అవుతుందని నమ్ముతారు. అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం నవగ్రహ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నవగ్రహాలు మనుషుల జీవితాలపై శుభ, అశుభ ప్రభావాలను చూపిస్తాయి. నవగ్రహాలకు పూజ చేసేటప్పుడు నవగ్రహ స్తోత్రములు జపించడం వల్ల అంతా మంచే జరుగుతుంది. తప్పనిసరిగా నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయాలి. అలాగే ప్రదక్షిణలు చేసే సమయంలో విగ్రహాలను చేతితో తాకరాదు.

నవగ్రహాలలో ముందుగా సూర్యుడిని ఆరాధించిన తర్వాత మిగతా వాటికి పూజ చేయాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన రోజు కొన్ని నియమాలు పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. మద్యం సేవించడం. మాంసం తినడం వంటివి పొరపాటున కూడా చేయకూడదు. దీని వల్ల మీకు అననుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం