Dev Deepawali: దేవతల దీపావళి గురించి మీకు తెలుసా.. ఎప్పుడు ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం
11 November 2024, 13:46 IST
- దీపావళి గురించి మనందరికీ తెలుసు. కానీ దేవత దీపావళి గురించి ఎప్పుడైనా విన్నారా..! భక్తులతో కలిసి దేవతలంతా జరుపుకునే ఈ పండగ ప్రాముఖ్యత ఏంటి.. ఎప్పుడు, ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం.
దేవతల దీపావళి ప్రాముఖ్యత
దీపావళి పండుగ కేవలం మనుషులకు మాత్రమే కాదు.. దేవతలకు కూడా ఉంటుందని మీకు తెలుసా. దేవ్ దీపావళి లేదా దేవ్ దీవాళిగా పిలిచే దేవతల దీపావళి పండుగను తమ భక్తులతో పాటు దేవుళ్లు కూడా జరుపుకుంటారు. కార్తీక పూర్ణిమ రోజున జరిగే ఈ ఉత్సవాన్ని గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారం నవంబరులో జరుపుకుంటారు. భారతదేశంలో జరుపుకునే అత్యంత అద్భుతమైన పండుగలలో దేవతల దీపావళి ఒకటి. భూమిపై వెలిగించే ఈ దీపాలను నేరుగా వీక్షించేందుకు దేవతలే నేలకు దిగి వస్తారని భక్తుల నమ్మిక.
దేవతల దీపావళి ఎలా జరుపుకుంటారు:
తారకక్ష, విద్యున్‌మ్లి, కమలాక్ష అనే మూడు రాక్షస పేర్ల కలయిక అయిన త్రిపురాసురకు, పరమేశ్వరుడికి యుద్ధం జరిగింది. ఆ ఘట్టంలో పరమేశ్వరుడు సాధించిన విజయాన్నే దేవతల దీపావళిగా జరుపుకుంటారు. ఈ దేవతల దీపావళి పండుగను ఎక్కువగా వారణాసి లేదా కాశీలో జరుపుకుంటారు. దేవతలంతా కలిసి పవిత్ర గంగానదిలో స్నానమాచరిస్తాని నమ్ముతారు. వారికి స్వాగతం చెబుతూ దీపాలు, రంగు రంగుల ముగ్గులతో తమ నివాసాలను అలంకరించుకుంటారు. ఆ రోజు రాత్రి వారణాసి భూమిపై స్వర్గంలా మారిపోతుంది. ప్రత్యేకించి నది ఒడ్డున నూనె దీపాలు వెలిగించడంతో పాటు నగరం మొత్తాన్ని ప్రత్యేకంగా అలంకరించుకుంటారు.
ఆ రోజున దీపాలు, కాంతులను ఘాటల వద్ద, ఆరు బయట, ఇంటి బయట ఉంచుతారు. తద్వారా దేవతలు దివి నుంచి భువి దిగి వస్తారని విశ్వసిస్తారు. పూజారులు ప్రత్యేకమైన ఘంటాధ్వానాలతో, గంగా హారతితో స్వాగతం పలుకుతారు. భక్తులంతా దేవతలతో పాటు తాము కూడా గంగాస్నానం ఆచరించినట్లుగా భావిస్తారు.
దేవతల దీపావళి ప్రాముఖ్యత:
హిందూ పురాణాల ప్రకారం, త్రిపురాసుర అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి కొన్ని వరాలు అందుకున్నాడు. ఆ శక్తులతో ఆకాశంలోనూ, స్వర్గంలో, భూమి మీద మూడు నగరాలను నిర్మించాడు. ఈ మూడు నగరాలను రక్షించుకుంటూ మరింత శక్తివంతంగా మారిపోయాడు. దేవుళ్ల కంట పడకుండా ఉండగలిగినందుకు తనపై తనకే అతి విశ్వాసం పెరిగిపోయింది. క్రమంగా దేవుళ్లపై దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా అత్యంత క్రూరుడిగా మారిపోయిన త్రిపురాసురుడు దేవుళ్లను హింసించే తీరు హద్దు మీరిపోయింది. దేవుళ్లందరూ కలిసి రాక్షసుడ్ని హతమార్చి తమను కాపాడాలంటూ మహాదేవుడ్ని వేడుకున్నారు. ఒకే బాణంతో మూడు నగరాలను కాలిస్తేనే తాము బయటపడతామని విన్నవించారు. వారి మొర విన్న పరమశివుడు త్రిపురారి అనే అవతారం ధరించి ప్రత్యేక రథమున వెళ్లి తన విల్లుతో త్రిపురాసురకు ఎక్కు పెడతాడు. ఒకే ఒక్క బాణంతో మూడు నగరాలను ధ్వంసం చేసి ప్రపంచానికి విముక్తి కలిగిస్తాడు. ఆ తర్వాత దేవుళ్లందరితో కలిసి భూమిపైకి వచ్చి గంగానదిలో పవిత్ర స్నానం చేస్తాడు.
దేవతల దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి:
ద్రిక్ పంచాంగం ప్రకారం, 2024లో దేవతల దీపావళిని శుక్రవారం, నవంబరు 15న జరుపుకోవాలి.
ప్రదోషకాల దేవతల దీపావళి ముహూర్తం - సాయంత్రం 05:10 నుంచి 07:47 వరకూ
సమయం - 2 గంటల 37 నిమిషాలు
పౌర్ణమి తిథి ప్రారంభం - 2024 నవంబరు 15 ఉదయం 06:19 గంటల నుంచి
పౌర్ణమి తిథి సమాప్తం - 2024 నవంబరు 16 ఉదయం 02:58 గంటల వరకు ఉంటుంది.
టాపిక్