తథాస్తు దేవతలు ఎవరు? వాళ్ళు నిజంగా ఉన్నారా?

pixabay

By Gunti Soundarya
Aug 28, 2024

Hindustan Times
Telugu

సాయంత్రం వేళ ఏదైనా మాట పదే పదే అంటుంటే తథాస్తు దేవతలు ఉంటారు. చెడు మాట ఎక్కువ సార్లు అంటే నిజమవుతుందని అంటుంటారు. 

pixabay

నిజంగానే తథాస్తు దేవతలు ఉంటారా? వాళ్ళు ఎలా ఉంటారు? నిజంగానే ఉన్నారా అనేది తెలుసుకుందాం. 

pixabay

తథాస్తు దేవతలు అంటే సూర్యుని కుమారులు అని చెబుతారు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవికి కలిగిన సంతానమే వీరని అంటారు. 

pixabay

సంధ్య వేళ ఈ తథాస్తు దేవతలు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం ఏదైనా చెడు మాట ఎక్కువగా మన నోటి నుంచి వస్తే దేవతలు తథాస్తు అనేస్తారట. 

pixabay

ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాటలు పదే పదే అంటే దేవతలు కూడా తథాస్తు అనేస్తారట. తథాస్తు అనేది మన సొంత విషయంలోనే వర్తిస్తుంది. 

pixabay

చాలా మంది నోటి నుంచి ఎక్కువగా వచ్చే మాట డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని అంటుంటారు. ఇలా అంటే నిజంగానే డబ్బు లేకుండా పోతుందట. 

pixabay

అందుకే ఏదైన మాట పలుమార్లు అనేటప్పుడు ముందు వెనుక ఆలోచించాలని చెబుతారు. 

pixabay

హాట్ షోతో అట్రాక్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటి దీప్తి సునైనా

Instagram