Wealth Remedies: ఆర్థిక బాధల నుంచి బయటపడాలంటే ఈ తప్పులు చేయకండి
12 December 2024, 9:30 IST
- Wealth Remedies: వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేటట్టు చూసుకోవాలి. ప్రతికూల శక్తి ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మొదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Wealth Remedies: ఆర్థిక బాధల నుంచి బయటపడాలంటే ఈ తప్పులు చేయకండి
ప్రతీ ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ, చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన ఇబ్బందులు తప్పవు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేటట్టు చూసుకోవాలి. ప్రతికూల శక్తి ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మొదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
లేటెస్ట్ ఫోటోలు
ఇంట్లో ఇవి ఉండడం వలన ఇంట్లో సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా కలుగుతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కూడా అవ్వదు. ఇటువంటివి మీరు కూడా మీ ఇంట్లో ఉంచినట్లయితే వెంటనే తొలగించడం మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పాత, చిరిగిపోయిన దుస్తులు:
ఇంట్లో ఎప్పుడు కూడా పాత, చిరిగిపోయిన దుస్తుల్ని ఉంచకూడదు. ఉపయోగించని వాటిని ఎవరికైనా ఇవ్వడం లేకపోతే ఇంటి నుంచి తీసేయడం మంచిది. ఇలాంటివి ఇంట్లో ఉండడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. పైగా సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది.
ఇంటి మేడ మీద చెత్త, పనికిరాని సామాన్లు:
చాలా మంది పనికిరాని సామాన్లను ఎక్కడా చోటు లేక మేడ పైన పెడుతుంటారు. అలాగే విరిగిపోయినవి, పాత సామాన్లని, ఉపయోగించనివి అన్నీ కూడా పైన పెడుతుంటారు. అలా మేడ పైన పెట్టకూడదు. మేడ పైన ఉపయోగించని సామాన్లు, చెత్తాచెదారం వంటివి పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో పాటుగా పలు సమస్యలను తీసుకువస్తుంది.
ఇంట్లో ఫర్నీచర్:
చాలామంది ఉపయోగించని సామాన్లను ఇంట్లో ఉంచుతూ ఉంటారు. అవి కూడా ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. సానుకూల శక్తిని దూరం చేస్తాయి. పనికిరాని ఫర్నీచర్, ఉపయోగించనివి ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి తొలగించడమే మంచిది. వీటి వలన కూడా ఇబ్బందులు వస్తాయి.
వాడిపోయిన మొక్కలు, పూలు:
వాడిపోయిన మొక్కలు, వాడిపోయిన పూలు వంటివి ఇంట్లో ఉండకూడదు. ఎప్పుడైనా పూలు కానీ మొక్కలు కానీ వాడిపోతే వాటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది. ప్రతికూల శక్తి ప్రవహించడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇటువంటి పెయింటింగ్స్ ఉండకూడదు:
ప్రతికూల శక్తిని అందించే పెయింటింగ్స్ కూడా ఇంట్లో ఉండడం మంచిది కాదు. యుద్ధానికి సంబంధించిన పెయింటింగ్లు, పేదరికం సూచించేవి, బాధాకరమైనవి అసలు పెట్టకండి. ఇటువంటి వాటి వలన కూడా ఇబ్బందులు వస్తాయని గుర్తు పెట్టుకోండి.