తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ అమ్మవారిని పూజించి, ఇలా ఉపవాసం చేస్తే మీ కోరికలు నెరవేరడం ఖాయం

Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ అమ్మవారిని పూజించి, ఇలా ఉపవాసం చేస్తే మీ కోరికలు నెరవేరడం ఖాయం

Galeti Rajendra HT Telugu

15 August 2024, 13:29 IST

google News
    • Varalakshmi : హిందువుల ఇళ్లల్లో శ్రావణ శుక్రవారం (రేపు) పండుగ వాతావరణం ఉట్టిపడనుంది. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరుతూ ఇంట్లోని మహిళలు చాలా పవిత్రంగా వరలక్ష్మీ వ్రతం చేయడం ఆనాదిగా వస్తోంది. లక్ష్మీదేవికి మరో రూపమైన వరలక్ష్మి అమ్మవారిని.. 
అమ్మవారు
అమ్మవారు (Unsplash)

అమ్మవారు

Varalakshmi Vratham 2024 : వరలక్ష్మి అంటే లక్ష్మీ స్వరూపం.. వరాలు ఇచ్చే దేవత అని అర్థం. సంపద నుంచి ఆయుష్షు వరకు వరలక్ష్మి తన భక్తులకు జీవితంలో అన్నింటినీ ప్రసాదిస్తారు.

వరలక్ష్మి అమ్మవారు నాలుగు చేతులతో ఉండి.. కమలం, శంఖం, సంపద కుండ, రక్షణ చిహ్నంతో కనిపిస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు.

ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16న (శుక్రవారం) రోజున వచ్చింది. హిందువులు ఈ శుక్రవారం ఉపవాస దీక్షలో ఉండి.. ఇంటిళ్లపాది ఆరోగ్యం, దీర్ఘాయువు, ధనం కోసం పూజలు చేస్తారు. వరలక్ష్మిని పూజిస్తే.. లక్ష్మీదేవిని కూడా పూజించినట్లే.. ‘అష్టలక్ష్మి’ రూపంలో అన్ని రూపాలు వరలక్ష్మి అమ్మవారిలో ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

ఉపవాసం వెనుక నమ్మకం

వివాహిత స్త్రీలు వరలక్ష్మీ వ్రతాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, మహిళలు తమ కుటుంబాల శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం తమ బాధ్యతగా భావిస్తారు. ఆరోజు మొత్తం ఉపవాసం చేసే వాళ్లు కూడా ఉన్నారు. అలా ఉపవాస దీక్ష చేస్తే వారి భర్తకు, పిల్లలకు కూడా అమ్మవారు దీవెనలు ఇస్తారని ఓ నమ్మకం.

వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటాయి. కొంత మంది మహిళలు రోజంతా ఆహారం తినకుండా ఉపవాసం ఉంటారు. మరికొందరు పూజ పూర్తయ్యే వరకు ఉండి.. అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత దీక్షని విరమిస్తారు.


పూజా విధానం

వ్రతాన్ని ఆచరించడానికి ముందు వంటగది, పూజ గది, ఇంటిని శుభ్రపరచాలి. ఇంటిని పూలతో అలంకరించి.. లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని కలశం దగ్గర ఉంచాలి. ఆ కలశంపై కొబ్బరికాయను ఉంచాలి.

స్నానం చేసిన తర్వాత నెయ్యి దియా వెలిగించి, లక్ష్మీదేవి మంత్రాలను పఠించడం ద్వారా పూజను ప్రారంభించాలి. శ్రావణ శుక్రవారం రోజున పూజ సమయంలో మీరు ఓం శ్రీం మహా లక్ష్మీయై నమః మంత్రం జపించాలి. ఆ తర్వాత మహాలక్ష్మీ అష్టకం స్తోత్రం, లక్ష్మీ గాయత్రీ మంత్రం కూడా జపిస్తే అమ్మవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది.

తదుపరి వ్యాసం