తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: సూర్యుడి సంచారం.. ఈ రాశుల జాతకులు కెరీర్ లో దూసుకుపోతారు

Sun transit: సూర్యుడి సంచారం.. ఈ రాశుల జాతకులు కెరీర్ లో దూసుకుపోతారు

Gunti Soundarya HT Telugu

03 April 2024, 18:05 IST

    • Sun transit: సూర్యుడు త్వరలో మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల జాతకులు కెరీర్ లో దూసుకుపోతారు. ఉద్యోగంలో ప్రమోషన్, జీతంలో పెరుగుదలతో సంతోషంగా ఉంటారు. 
సూర్యుడి సంచారంతో కెరీర్ లో దూసుకుపోతారు
సూర్యుడి సంచారంతో కెరీర్ లో దూసుకుపోతారు (pixabay)

సూర్యుడి సంచారంతో కెరీర్ లో దూసుకుపోతారు

Sun transit: గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు నెలకొకసారి తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సూర్యుడు ఏప్రిల్ 13న మేష రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడి స్థానం అనుకూలంగా ఉంటే వృత్తిలో విజయాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వృత్తిపరంగా పురోగతి ఉంటుంది. మేషరాశిలో సూర్య సంచారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో శక్తి స్థాయిలు, ఉత్సాహం పెరుగుతాయి.

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

కెరీర్ లో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏ పని ప్రారంభించిన విజయం వరిస్తుంది. మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మీ భావాలను ఇతరులకు వ్యక్తం చేయడంలో ధైర్యంగా ముందుకు వెళతారు. సూర్యుడి శుభ స్థానం వల్ల జీవితంలో గౌరవం, కీర్తి పెరుగుతుంది. ధైర్యం రెట్టింపు అవుతుంది. మేషరాశిలో సూర్యుడి సంచారం వల్ల కెరీర్ లోవృద్ధి పొందే రాశులు ఇవే.

మేష రాశి

మేష రాశి లగ్న గృహంలో సూర్యుడు సంచరిస్తాడు. ఈ సమయంలో వృత్తిలో అపారమైన ప్రయోజనాలు పొందుతారు. శ్రద్ధగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కార్యాలయంలో ప్రతి ఒక్కరు ఈ పనులు పట్ల సంతోషంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులు పనిలో మిమ్మల్ని అనుసరించాలని ప్రయత్నిస్తారు. వృత్తిలో పురోగతి మీ మనసుకు సంతోషాన్ని ఇస్తుంది.

మిథున రాశి

మిథున రాశి వారికి సూర్య సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. జీతం పెరుగుతుంది. సీనియర్ అధికారులతో మంచి సంబంధం ఏర్పడుతుంది. పనిలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయిపనితీరు ఆకట్టుకునేలా ఉంటుంది. సూర్యుడి అనుగ్రహంతో వివిధ పనులను ఏకకాలంలో పూర్తి చేయగలుగుతారు. కార్యాలయంలో కీర్తి, గౌరవం కూడా పెరుగుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు పదో ఇంట్లో సూర్యుడు సంచరించబోతున్నాడు. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ పనులను గుర్తిస్తారు. మీ కృషి, ప్రయత్నాలను సీనియర్లు గుర్తిస్తారు. ప్రశంసలు దక్కుతాయి. అంకితభావంతో పని చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పదోన్నతి పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా జీతాలు పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో వారి కోరిక నెరవేరుతుంది. విదేశాల నుంచి ప్రాజెక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి. తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోగలుగుతారు. సహ ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

ధనుస్సు రాశి

సూర్యుడి సంచారం ధనుస్సు రాశి ఐదో ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో కెరీర్ లో చాలా పురోగతి కనిపిస్తుంది. కొత్త, వినూత్న ఆలోచనలతో కెరీర్ లో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. వ్యాపారవేత్తలు సరైన వ్యూహాలు అనుసరించడం వల్ల విజయానికి చేరువవుతారు. భాగస్వామ్య వ్యాపారము అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి

ఈ సమయంలో కుంభ రాశి జాతకులు తమ కెరీర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పని తలపెట్టిన అందులో విజయం మీదే అవుతుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందటంతో చాలా సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అందుకు ఉత్తమం.

తదుపరి వ్యాసం