Sun jupiter conjunction: సూర్యుడు, బృహస్పతి కలయిక.. ఈ మూడు రాశులకు అదృష్టం, పోటీ పరీక్షల్లో విజయం
Sun jupiter conjunction: మేష రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత సూర్యుడు, బృహస్పతి కలుసుకోబోతున్నారు. ఫలితంగా మూడు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
Sun jupiter conjunction: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు గ్రహాల రాజు. తండ్రి, అధికారం, అహంకారం, ఆత్మగౌరవం, ధైర్యాన్ని సూచిస్తాడు. ఇక దేవ గురువు బృహస్పతి సంపద, జ్ఞానం, ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. అటువంటి రెండు గ్రహాలు త్వరలో కలుసుకోబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, బృహస్పతి కలయిక చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల ఒకరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అధికారం విస్తరిస్తుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మేష రాశిలో సూర్య, గురు గ్రహాల సంయోగం జరుగుతుంది.
నెలకు ఒకసారి సూర్యుడు తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు. అలా మీన రాశిలో ఉన్న సూర్యుడు ఏప్రిల్ 13న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అక్కడ ఉన్న బృహస్పతితో సంయోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వాళ్ళు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మేషరాశిలో సూర్యుడు, గురు గ్రహాల కలయిక శుభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రతి పనిలో విజయం మీదే. అదృష్టం వరిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు అద్భుతమైన విజయం పొందుతారు. ఏయే రాశుల వారికి ఈ గ్రహాలు అదృష్టాన్ని ఇస్తాయో చూద్దాం.
మేష రాశి
మేష రాశిలోనే సూర్యుడు, బృహస్పతి కలయిక జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గ్రహాల కలయిక శుభప్రభావంతో వృత్తిలో పురోగతి సాధిస్తారు. లవ్ లైఫ్ రొమాంటిక్ గా ఉంటుంది. మీకు మీ భాగస్వామికి మధ్య బంధం దృఢంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. జన్మ చార్ట్ లో బృహస్పతి స్థానం బలంగా ఉంటే ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. జీవితంలో కొత్త అంశాలు కనుగొనేందుకు ఆసక్తి చూపిస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కోరికలన్నీ నెరవేరుతాయి. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మిథున రాశి
ఈ రెండు గ్రహాల కలయిక మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అనేక మార్గాల నుండి ఆదాయాన్ని పొందుతారు. కుటుంబం మీకు పూర్తి మద్దతు ఇస్తుంది. వృత్తిలో నైపుణ్యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మిథున రాశి వారికి ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు తారసపడతాయి. పాత పెట్టుబడులు ఇప్పుడు లాభదాయకమైన రాబడిని ఇస్తాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు.
సింహ రాశి
ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. విధి మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో విజయానికి మార్గం సుగమం అవుతుంది. సూర్య, గురు గ్రహాల సంయోగం సింహ రాశి తొమ్మిదో ఇంట్లో జరుగుతుంది. నిలిచిపోయిన పనులన్నీ ఈ కాలంలో పూర్తి కాబోతున్నాయి. జీవితంలో అనేక రంగాలలో విజయం సాధిస్తారు. పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సమయ స్పూర్తితో వ్యవహరిస్తారు. ఈ సమయంలో చాలా సంతోషంగా, సంతృప్తిగా కనిపిస్తారు. పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు అద్భుతమైన ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యక్తిగత వృద్ధి ఉంటుంది.
సంబంధిత కథనం