తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhanu Rasi This Week: ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆదాయానికి కొత్త మార్గం దొరుకుతుంది, తొందరపడి వస్తువుల్ని కొనకండి

Dhanu Rasi This Week: ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆదాయానికి కొత్త మార్గం దొరుకుతుంది, తొందరపడి వస్తువుల్ని కొనకండి

Galeti Rajendra HT Telugu

08 September 2024, 7:17 IST

google News
  • Sagittarius Weekly Horoscope: రాశి చక్రంలో 9వ రాశి ధనుస్సు రాశి. పుట్టిన సమయంలో ధనుస్సు రాశిలో సంచరించే జాతకుల రాశిని ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ వారం.. అంటే సెప్టెంబరు 8 నుంచి 14వ వరకు ధనుస్సు రాశి వారి ప్రేమ, కెరీర్, ఆర్థిక, ఆరోగ్య జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం. 
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

Dhanu Rasi Weekly Horoscope 8th September to 14th September: ధనుస్సు రాశి వారు ఈ వారం ఆఫీసులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని పనుల్లో అదనపు బాధ్యతలకు సిద్ధపడతారు. మీరు వృత్తి జీవితంలో చాలా బిజీగా ఉంటారు. కెరీర్ లో కొత్త సానుకూల మార్పుల కోసం మీరు చాలా ప్రేరణ పొందుతారు. రిలేషన్‌షిప్స్‌లో ప్రేమ, రొమాన్స్ పెరుగుతాయి. వృత్తిలో ఎదుగుదలకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

ప్రేమ

సంబంధాలలో ప్రేమ, ఉత్సాహానికి కొదవ ఉండదు. మీ శృంగార జీవితంలో కొత్త సర్‌ప్రైజ్‌లు పొందుతారు. ఒంటరి వ్యక్తుల ప్రేమ జీవితంలో కొత్త ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. మీ మనసు చెప్పేది వినండి. బంధంలో బాధపెట్టే విషయాల గురించి మీ భాగస్వామితో చర్చించవద్దు. రిలేషన్‌షిప్‌లో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. ఇది సంబంధాలలో పరస్పర అవగాహన, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.

కెరీర్

వృత్తి జీవితంలో ధనుస్సు రాశి వారి పురోగతికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు స్వీకరిస్తారు. మీరు పనిలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. కొత్త కెరీర్ ప్రమోషన్ ఆప్షన్లపై ఓ కన్నేసి ఉంచండి. కెరీర్‌కు సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా మంచి సమయం.

జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు ఉంటాయి, కాబట్టి సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఇబ్బందులకు భయపడకండి. దీని ద్వారా మీరు తప్పకుండా విజయాన్ని పొందుతారు.

ఆర్థిక

ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బడ్జెట్‌పై దృష్టి పెట్టండి. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. అలాగే, పెట్టుబడి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోండి. తొందరపడి వస్తువు కొనకండి. వృథా ఖర్చులను నియంత్రించండి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఆరోగ్యం

కొత్త శారీరక శ్రమలో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి. రోజూ వ్యాయామం, యోగా చేయాలి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను పాటించండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

తదుపరి వ్యాసం