తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Narayana Yogam: ధన త్రయోదశి నుంచి లక్ష్మీ నారాయణ యోగం- ఆర్థిక లాభాలు, కొత్త వాహనం కొంటారు

Lakshmi narayana yogam: ధన త్రయోదశి నుంచి లక్ష్మీ నారాయణ యోగం- ఆర్థిక లాభాలు, కొత్త వాహనం కొంటారు

Gunti Soundarya HT Telugu

21 October 2024, 15:13 IST

google News
    • Lakshmi narayana yogam: బుధుడు ధన త్రయోదశి నుంచి వృశ్చిక రాశిలో సంచరించబోతున్నాడు. అక్కడ ఇప్పటికే శుక్రుడు సంచరిస్తున్నాడు. దీంతో బుధ, శుక్ర కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావంతో దీపావళికి ముందే ఈ రాశులకు అధిక లాభాలు కలగబోతున్నాయి. 
ధన త్రయోదశి నుంచి లక్ష్మీ నారాయణ యోగం
ధన త్రయోదశి నుంచి లక్ష్మీ నారాయణ యోగం

ధన త్రయోదశి నుంచి లక్ష్మీ నారాయణ యోగం

గ్రహాల రాకుమారుడైన బుధుడు త్వరలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం బుధుడు తులా రాశిలో ఉన్నాడు. నవగ్రహాలలో చంద్రుడి తర్వాత అత్యంత వేగంగా తన రాశిని మార్చుకోగల గ్రహం బుధుడు. 

తెలివితేటలు, కమ్యూనికేషన్స్, వ్యాపారం, వృత్తి వంటి వాటికి బుధుడు కారకుడిగా పిలుస్తారు. బుధ సంచారం కొన్ని రాశులకు శుభప్రదమైనది,ఇతరులకు అశుభకరమైనదిగా నిరూపించవచ్చు. మరి కొద్ది రోజుల్లో బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి సంవత్సరం చివరి వరకు ఇదే రాశిలో ఉంటాడు. పంచాంగ్ ప్రకారం బుధుడు వృశ్చిక రాశి తర్వాత తన తదుపరి సంచారాన్ని జనవరి 4, 2025న చేస్తుంది. అక్టోబర్ 29 ధన త్రయోదశి నుంచి బుధుడు వృశ్చిక రాశిలో తన ప్రయాణం ప్రారంభిస్తాడు. దీని ప్రభావం వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

అక్టోబరు 29న బుధగ్రహ సంచారం వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ధన త్రయోదశి శుభ సందర్భంగా బుధుడు అంగారక రాశి వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే సంపదలను ఇచ్చే శుక్రుడు సంచరిస్తున్నాడు. దీంతో బుధుడు, శుక్రుడితో కలిసి లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. 

శుక్రుడు సంపద, శ్రేయస్సు, భౌతిక ఆనందానికి కారకంగా పరిగస్తారు. ఇద్దరి కలయికతో ఏర్పడిన లక్ష్మీ నారాయణ రాజయోగం జీవితంలో కొత్త పురోగమన పథాలను తెరుస్తుంది. ఐదు రాశుల వారు ఈ ధనత్రయోదశి నుంచి ధనవంతులు అవుతారు. మిథునం, తులారాశి, సింహం, వృశ్చికం, కుంభం రాశుల వారికి అదృష్టం మెరిసే అవకాశం ఉంది. లక్ష్మీ నారాయణ రాజయోగ ప్రభావం వల్ల మిథునం, తులా రాశుల వారు తమ కెరీర్‌లో ఊహించని పురోగతిని పొందుతారు. అలాగే దీపావళి శుభ సందర్భంగా వ్యాపారంలో కూడా భారీ ఆదాయాలు ఉంటాయి.

మిథున రాశి 

బుధ సంచారం మిథునరాశిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మీ జేబు నిండుతుంది. కానీ మీ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయం మీకు రాజయోగాన్ని తెచ్చిపెట్టింది. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. అందుకే డబ్బుల విషయంలో జాగ్రత్త వహించాలి. 

సింహ రాశి

సింహ రాశి జాతకులకు బుధ సంచార శుభ ప్రభావం వల్ల కొన్ని అద్భుతమైన పనులకు ప్రభుత్వ గౌరవం పొందవచ్చు. ఈ సమయంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

తులా రాశి 

తులా రాశి వారు బుధ సంచార ప్రభావంతో ఆర్థికంగా లాభపడతారు. అత్తమామల నుండి సహాయం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. ఆనందంగా జీవిస్తారు. 

వృశ్చిక రాశి 

ఈ రాశిలోనే బుధ, శుక్ర కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతోంది. ఇది చాలా శుభకరమైనది. ఈ యోగం ప్రభావంతో వృశ్చిక రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

కుంభ రాశి 

బుధుడి సంచార ప్రభావం కారణంగా కుంభ రాశి వారికి మేలు జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. మీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

తదుపరి వ్యాసం