Mercury transit: ఉదయించబోతున్న బుధుడు- ప్రత్యర్థులు ఆశ్చర్యపోయేలా ఎదుగుతారు, ఆదాయం పెరుగుతుంది
Mercury transit: గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడు అక్టోబర్ 22 తులా రాశిలో ఉదయించబోతున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచే విధంగా ఎదుగుతారు. ఆదాయం పెంచుకుంటూ డబ్బు ఆదా చేసుకుంటారు.
గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, వృత్తి, నైపుణ్యాలను సూచిస్తాడు. ప్రస్తుతం తులా రాశిలో అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు అక్టోబర్ 22న ఉదయించబోతున్నాడు.
తులా రాశి బుధుడికి స్నేహపూర్వక రాశి. శుక్రుడు దీనికి అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, శుక్రుడు స్నేహపూర్వక గ్రహాలుగా చెబుతారు. ధన త్రయోదశి రోజు అంటే 29 అక్టోబర్ న తులా రాశిని వీడి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.
తులా రాశిలో బుధుడు ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది. తులా రాశిలో బుధుడు ఉన్నత స్థానంలో ఉంటారు. సంపూర్ణమైన వృత్తిని సాధించవచ్చు. తెలివితేటలు పెరుగుతాయి. ఈ సమయంలో ప్రజలు తీసుకుని నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. తులా రాశిలో బుధుడు ఉదయించడం వల్ల ఏ రాశుల వారు ప్రభావితం అవుతారో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథున రాశి ఐదో ఇంట్లో బుధుడు ఉదయించబోతున్నాడు. ఈ సమయంలో కెరీర్ లో ముందుకు సాగేందుకు అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరంగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తారు. మీ కృషిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. కొత్త బాధ్యతలు అందుతాయి. వ్యాపారంలో మీ కృషితో ఆదాయాన్ని తెచ్చుకుంటారు. ప్రత్యర్థులకు సమర్ధవంతంగా పోటీ ఇస్తారు. వ్యాపారంలో మీరు చూపించే వ్యూహాలు ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తాయి. ఆదాయం సంపాదించుకునేందుకు ఇదే సదావకాశం.
సింహ రాశి
సింహ రాశి మూడో ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీని ఫలితంగా ఉద్యోగంలో కార్యాలయంలో మీకు కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. సరికొత్త ఆఫర్లు అందుతాయి. వ్యాపారపరంగా విజయవంతం అవుతారు. పనుల కోసం ప్రయాణిస్తారు. ఇవి మీకు ఆర్థిక విజయాన్ని అందించేందుకు సహాయపడతాయి. డబ్బు ఆదా చేయగలుగుతారు.
కన్యా రాశి
కన్యా రాశి రెండో ఇంట్లో బుధుడు ఉదయిస్తాడు. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్, వేతన పెంపుదల అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు కీలకమైన సమయం. కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లేందుకు అవసరమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగాన్ని మెరుగుపరుచుకుంటూ డబ్బు ఆదా చేస్తుంటారు.
తులా రాశి
తులా రాశిలోనే బుధుడు ఉదయిస్తాడు. ఈ సందర్భంగా మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. విదేశాలకు ప్రయాణించే అవకాశం కూడా లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి విదేశీ ఒప్పందాలు జరుగుతాయి. సంపద పెరుగుతుంది. ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరుస్తాయి.
మకర రాశి
మకర రాశి పదవ ఇంట్లో బుధుడి సంచారం జరగబోతుంది. ఈ సమయంలో మీకు అధిక పురోగతికి అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా జీవిస్తారు. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగంలో ఆశాజనక మార్పులు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలకు వెళతారు. వ్యాపారంలో పోటీదారుల మీద పై చేయి సాధిస్తారు. ఆదాయాన్ని పెంచుకుంటారు.
కుంభ రాశి
కుంభ రాశి బుధుడి సంచారం శుభ ఫలితాలు ఇస్తుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. వారసత్వ ఆస్తి మీకు లభిస్తుంది. వృత్తిపరమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పనిపట్ల మరింత ఉత్సాహంతో ఉంటారు. వ్యాపారంలో మీరు తీసుకునే ఆలోచనలు మిమ్మల్ని విజయం సాధించేలా చేస్తాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన కొత్త వ్యాపార వ్యూహాలను అమలుపరుస్తారు. సంపద పెంచుకుంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.