Dhanteras 2024: ధన త్రయోదశి రోజు ఇవి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది మొత్తం మీకు డబ్బుకు కొదువ ఉండదు-follow these simple remedies on dhanteras 2024 you will get goddess lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhanteras 2024: ధన త్రయోదశి రోజు ఇవి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది మొత్తం మీకు డబ్బుకు కొదువ ఉండదు

Dhanteras 2024: ధన త్రయోదశి రోజు ఇవి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది మొత్తం మీకు డబ్బుకు కొదువ ఉండదు

Gunti Soundarya HT Telugu
Oct 16, 2024 07:50 PM IST

Dhanteras 2024: ధన త్రయోదశితో దీపావళి సంబరాలు మొదలవుతాయి. హిందూ శాస్త్రంలో ఈరోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధన త్రయోదశి రోజు కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఏడాది పొడవునా డబ్బుకు కొదువ ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.

ధన త్రయోదశి 2024
ధన త్రయోదశి 2024

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 29ణ మంగళవారం జరుపుకోనున్నారు. ఈరోజు బంగారం, వెండి ఆభరణాలు, కొత్త పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయం శతాబ్ధాలుగా కొనసాగుతోంది.

ధన త్రయోదశితోనే దీపావళి పండుగ సంబరాలు మొదలవుతాయి. ఈరోజు వినాయకుడు, లక్ష్మీదేవి, కుబెరుడిని పూజిస్తారు. ధన త్రయోదశి రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే సంపద అనేక రేట్లు పెరుగుతుందని విశ్వాసం. అలాగే వ్యక్తి జీవితంలో డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు. అందుకే ధన త్రయోదశి రోజు తప్పనిసరిగా ఏడదో ఒకటి కొంటారు.

ధన త్రయోదశి రోజు సంతోషం, శ్రేయస్సును పొందటం కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం మంచిది. ఇవి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ఉపయోగపడతాయి. ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం కోసం ఈ సులభమైన చర్యలు తీసుకోండి.

ఆర్థిక ఇబ్బందులు పోయేందుకు

ధన త్రయోదశి రోజు పసుపు నీటిలో సొరకాయలను నానబెట్టాలి. పూజ సమయంలో లక్ష్మీదేవి, కుబేరులతో సహ అందరి దేవుళ్ళు, దేవతలను ఆరాధించాలి. వారిని పూజించిన తర్వాత గోధుమలు పసుపు వస్త్రంలో కట్టి భద్రంగా ఉంచాలి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఆ వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు.

తామర పూల మాల

ధన త్రయోదశి రోజు లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వులు సమర్పించాలి. 108 తామర పూలతో చేసిన మాలను సమర్పించడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీపై అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉంటుంది.

తులసి పూజ

ధన త్రయోదశి రోజు ప్రదోష కాలంలో లక్ష్మీదేవి, వినాయకుడితో పాటు తులసి మొక్కను పూజించాలి. తులసి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఏ ఇంట్లో అయితే ఆచారాల ప్రకారం తులసిని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివశిస్తుందని నమ్ముతారు.

చీపురు విరాళంగా ఇవ్వండి

పవిత్రమైన ధన త్రయోదశి రోజు చీపురు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు చీపురు దానం కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల వాతావరణం ఉంటుందని నమ్ముతారు. చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈరోజు కొత్త చీపురు తీసుకొస్తే లక్ష్మీదేవి సంతోషించి ఏడాది పొడవునా సంపదను పెంచి ఆశీర్వాదాలు అందిస్తుంది.

13 దీపాలు వెలిగించాలి

దీపావళి సమయంలో 13 దీపాలు వెలిగించడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులకు రోగాలు, జాతకంలోని దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

కొత్తిమీర కొనండి

లక్ష్మీదేవికి కొత్తిమీర ఎంతో ప్రీతికరమైనది. అందుకే పూజలో తప్పనిసరిగా కొత్తిమీర సమర్పించాలి. అలాగే ధన త్రయోదశి రోజు కొత్తిమీర కొనడం మంచిది. పూజ చేసిన తర్వాత కొన్ని కొత్తిమీర గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి వాటిని భద్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఒక కుండ తీసుకుని అందులో వాటిని నాటాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner