వారఫలాలు- ఈ వారం అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు
20 October 2024, 2:00 IST
Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. అక్టోబర్ 20 నుంచి 26వ తేదీ వరకు వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
అక్టోబర్ 20 నుంచి 26 వరకు వారఫలాలు
రాశి ఫలాలు (వార ఫలాలు) 20.10.2024 నుంచి 26.10.2024 వరకు
మాసం : అశ్వయుజము, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
గ్రహ సంచారాలు అనుకూలం. ప్రయత్నకార్య అనుకూలతలు ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన అన్నింటా జయమునివ్వగలదు. ఆదాయాలు, ఆరోగ్యం ఉత్సాహంనిచ్చు నదిగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలందు వృద్ధి ఉంటుంది. ప్రభుత్వపర లావాదేవీలను అనుకూలింప చేసుకుంటారు. కుటుంబములో సామరస్యతలు చూపుకోండి. సంతానం సిద్ధించగలదు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొను సూచనలు ఉన్నాయి. గురు, శుక్ర, శని, ఆది వారాలు అనువైనవి.
వృషభం
ఈ వారంలో కుటుంబ విషయాలలో మొండితనం, వాగ్వివాదాలు చూపి సృజననిరోధాలు పొందు సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యో గాల్లో సాధారణతలు కొనసాగినా మొక్కుబడితనమును చూపగలరు. సంతానంలో ఒకరికి ఉద్యోగ వృద్ధి ఉండగలదు. స్థాయిని మరచి స్నేహభావాలు చూపుతారు. విదేశీయత ఉపకారాలు సిద్ధించును. ఇతరుల వ్యక్తిగతాలకు దూరంగా ఉండుట మంచిది. శుక్ర, శని, ఆది, సోమవారములు అనువైనవి.
మిథునం
ఈ వారంలో ముఖ్యమయిన పనుల్ని అనుకున్నవిధంగా పూర్తి చేసుకోగల్గుతారు. సేవకాజన సౌఖ్యం, సకాల ఆహార విరామాదులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను ఇతరులకప్పగించకండి. స్వయంగానే చూసుకోవాలి. విద్యార్థులకు వ్యాసంగాలు అనుకూలం. ఆది, సోమ, బుధ వారములు అనుకూలం.
కర్కాటకం
ఈ వారం వారఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి గ్రహసంచారాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబంలో గౌరవమర్యాదలు వృద్ధిచెందుతాయి. కొన్ని తప్పనిసరి ప్రయాణాలు ఉంటాయి. సోదర వర్గమున విరోధభావాలు పెరగగలవు - దూరంగా ఉండుట మంచిది. ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చుకుంటారు. సద్గ్రంథ పఠనములు, విద్యావేత్తలతో గోష్టి ఏర్పడగలవు. గురు, శుక్ర, బుధ వారములు అనువైనవి.
సింహం
ఈ వారంలో శ్రమకు తగిన ప్రయోజనాలు పొందలేక చికాకుతనమును పొందు సూచనలున్నాయి. ఆర్థికపరమైన వృద్ధి ఉండి ఉత్సాహం కొనసాగుతుంది. బంధువర్గంచే సహాయాలుంటాయి. భూ లావాదేవీల్ని పూర్తిచేసుకోగలరు. కుటుంబ విషయాల్ని ఇతరులతో పంచుకోకండి. ఆరోగ్యం విషయంలో మంచి మార్పులుంటాయి. ఆచార వ్యవహారాలపై శ్రద్ధచూపుట ఉంటాయి. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి. శుక్ర, శని, ఆదివారాలు అనువైనవి.
కన్య
ఈ వారంలో మానసిక అధైర్యములు ఉంటున్నా తలపెట్టుకున్న పనులను పూర్తిచేసుకుంటారు. కుటుంబ వ్యక్తులచే సహాయ సహకారాలు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. ఇతరులకు సహకరించవలసిరావచ్చును, వృత్తి, వ్యాపారాల్లో చెల్లింపులు పూర్తిచేసుకొనునట్లు ఆదాయాలుంటాయి. విద్యార్థులు వ్యాసంగాలకు అంకితమై టార్గెట్ విధానాలను పాటించుకోవాలి. వీరికి గురు, ఆది, సోమ వారములు అనువైనవి.
తుల
ప్రయత్నికృత కార్యలాభాలు ఉంటాయి. నూతన వస్తు సేకరణలు, కుటుంబ వ్యక్తులకు బహుమతులు ఇచ్చుట ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహమునిచ్చు సంఘటనలుంటాయి. ఆరోగ్యపరంగా చిన్నతరహా జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. బంధు మిత్రుల సందడి, గృహంలో సందడితనమును పెంచ గలరు. విద్యార్థులు ఆసక్తికరముగా వ్యవహరించుకోలేకపోతారు. శుక్ర, శని, ఆది వారములు అనువైనవి.
వృశ్చికం
గ్రహసంచారాలు ప్రతికూలంగానే ఉన్నవి. గతంకంటే కొన్నింట ఉత్సాహకరంగా వ్యవహరించుకుంటారు. యంత్ర వాహనముల వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. కొన్ని ప్రయాణాలను మధ్యలో విరమించుకొను సూచనలు ఉన్నాయి. సద్గ్రంథ పఠనములు, మంచివారి పరిచయాలుంటాయి. కోర్టు-లిటిగేషన్ వంటి వ్యవహారాలలో అనుకూలతలు పెంచుకోగల్గుతారు. తీర్థయాత్రలు, దైవదర్శనాలు చేసుకుంటారు. గురు, ఆది, సోమ వారములు అనువైనవి.
ధనుస్సు
గ్రహసంచారాలు మిశ్రమ ప్రయోజనానిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో వృద్ధి నిచ్చును. విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశాలు కలిసివస్తాయి. కుటుంబంలో మిశ్రమ స్థితులుంటాయి. శరీరంలో తాపం పెరుగుతుంది. అధికారులచే ప్రశంసలు ఏర్పరచుకోగలరు. అవసరాలను సమర్థించుకొనునట్లు ఆదాయాలుంటాయి. గురు, శుక్ర, శని, ఆది వారములు అనుకూలమైనవి.
మకరం
వారఫలాల ప్రకాం ఈ వారంలో ప్రయత్న కార్యాలను ఉత్సాహంగా పూర్తిచేసుకోగల్గు తారు. మానసికంగా స్థిమితపడతారు. బంధుమిత్రులతో ముఖ్య విషయకంగా సమాలోచనలు చేస్తారు. స్థిరాస్తుల ఏర్పాట్లకు, గృహప్రవేశాది నిర్వహణలు చేపట్టుకోగలరు. విద్యార్థులకు ప్లేస్మెంటువంటి శుభవార్తలుంటాయి. కుటుంబంలో స్త్రీలకై ఖర్చులు, వ్యవహారాలలో చిక్కులు ఉంటాయి. ఆరోగ్య, ఆర్థికములు అనుకూలం. శుక్ర, శని, ఆది, సోమ వారములు అనువైనవి.
కుంభం
ఈ వారంలో ప్రశాంతతకు ప్రాధాన్యతనిచ్చి వ్యవహరించుకుంటారు. ఖర్చులు పెరుగుతున్నా లెక్కచేయని స్థితులను చూప గలరు. మాతాపితరుల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. అధికారులను సంతృప్తిపరచలేకపోయినా వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తి పొందగలరు. సంతాన పరంగా ఆలోచనలు చేయవలసి ఉంటుంది. వ్యాపారులు నెలవారీ చెల్లింపులకు జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. ఆది, సోమ, బుధ వారాలు అనువైనవి.
మీనం
గ్రహపంచారాలు మిశ్రమ ప్రయోజనానిస్తాయి. ఎప్పటికప్పుడు తగిన ఆలోచనలు చేసుకుంటూ కొన్ని పనులను వాయిదా వేసుకుంటారు. మాతాపితరుల ఆరోగ్యమందు మంచి మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తుల మార్పుచేర్పు ఆలోచనలు ఫలించగలవు. విద్యార్థులు టార్గెట్ విధానాల్ని పాటించు కోవాలి. శుక్ర, శని, ఆది వారములలో అన్నింటా జాగ్రత్తలు అవసరం.
అందించిన వారు: అధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ