Guru aditya rajayogam: గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశులకు ధనప్రాప్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి
Guru aditya rajayogam: మేష రాశిలో దేవ గురువు బృహస్పతి, సూర్యుడి కలయిక జరగబోతుంది. ఫలితంగా గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించబోతుంది.
Guru aditya rajayogam: గ్రహాల రాజు సూర్యుడు తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న సూర్య భగవానుడు ఏప్రిల్ 13న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మేష రాశిలో దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడు.
మేష రాశిలో సూర్య, గురు గ్రహాల సంయోగం పన్నెండు సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ సూర్య గురు సంయోగం మేష రాశిలో జన్మించిన వారికి శుభ కాలాన్ని తెలియజేస్తుంది. ఏప్రిల్31 వరకు బృహస్పతి ఇదే రాశిలో ఉంటాడు. మే 1వ తేదీన గురు గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు సూర్య కలయిక చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
సూర్యుడి సంచారం మేషరాశిలో నెలపాటు ఉంటుంది. మీన రాశిని వదిలి మేష రాశిలోకి ప్రవేశించడంతో ఖర్మలు కూడా ముగుస్తాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు ఆదిత్య అనే రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో సంపూర్ణ ఫలితాలతో పాటు కొన్ని రాశుల వారికి శుభాలు చేకూరుతాయి.
మేష రాశి
గురు సూర్య కలయిక వల్ల మేష రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మేధో సామర్థ్యం ఆధారంగా పనిలో మంచి పురోగతి ఉంటుంది. వ్యక్తిగతంగా దృఢంగా ఉంటారు. విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో తగదాలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వామ్య పనుల్లో సాధారణ పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృషభ రాశి
గురు ఆదిత్య రాజయోగ ప్రభావంతో వృషభ రాశి జాతకుల ఇంట్లో ఆనందం వెల్లి విరుస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రోగాలు, అప్పులు, శత్రువుల బాధ నుంచి విముక్తి పొందుతారు. కుటుంబ పెద్దలు సంతోషంగా ఉంటారు. పనిలో అదృష్టం వన్నంటే ఉంటుంది. భౌతిక సౌకర్యాల కోసం ఖర్చులు చేస్తారు. ఈ సమయంలో కంటి సమస్యలతో కొద్దిగా ఒత్తిడికి గురవుతారు.
మిథున రాశి
రెండు గ్రహాల కలయిక ప్రభావంతో మిథున రాశి వాళ్ళు సానుకూల అభివృద్ధి సాధిస్తారు. తోబుట్టువులు, మిత్రులతో అనుబంధం పెరుగుతుంది. విద్య, బోధనకు సంబంధించిన రంగాలలో వాళ్ళు శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి లబ్ధి పొందుతారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి
ధన సంబంధ పనులలో అనుకూల పురోగతి ఉంటుంది. రక్తపోటు లేదా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పనులలో సానుకూల పురోగతి సాధ్యమవుతుంది. గృహ వాహన సుఖాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించగలుగుతారు. కెరీర్లో ప్రమోషన్ పొందేందుకు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి
మనోధైర్యం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజకీయ నేతలు పదవులు పొందుతారు. సామాజిక హోదాలో మార్పులు చోటు చేసుకుంటాయి. పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. తల్లిదండ్రులను ఆనందంగా ఉంచుతారు. ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదల కనిపిస్తుంది. ధన, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.