తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: బుధుడి సంచారం.. ఈ రాశుల వైవాహిక, ప్రేమ జీవితంలో గొడవలు, కొట్లాటలే

Mercury transit: బుధుడి సంచారం.. ఈ రాశుల వైవాహిక, ప్రేమ జీవితంలో గొడవలు, కొట్లాటలే

Gunti Soundarya HT Telugu

22 May 2024, 17:10 IST

google News
    • Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారి వైవాహిక, ప్రేమ జీవితంలో గొడవలు, కొట్లాటలు ఏర్పడనున్నాయి. 
బుధుడి సంచారం
బుధుడి సంచారం

బుధుడి సంచారం

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మే నెలలో రెండోసారి తన రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సంచారం రాశి చక్రంలోని ప్రతి రాశిని ప్రభావితం చేస్తుంది. బుధుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి శృంగార జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

మే 31వ తేదీన బుధుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషం, కన్య, మిథునం, తుల, కుంభ రాశుల వ్యక్తులు బుధుడి వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతారు. సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. మేధోకారకుడిగా ఈ గ్రహాన్ని పిలుస్తారు. బుధుడి సంచారం ఏయే రాశుల వారు ప్రేమ జీవితంలో విభేదాలు ఎదుర్కొంటారో తెలుసుకుందాం.

మేష రాశి

బుధుడి సంచార ప్రభావం మేష రాశి వారి మీద ఉంటుంది .ఈ సమయంలో తమ భాగస్వాములతో వాగ్వాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆస్తి లేదా ఇతర విషయాలలో కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా రావచ్చు. మీ ప్రియమైన వారితో మాట పట్టింపులు వల్ల ఎక్కువగా మాట్లాడరు. ఇద్దరి మధ్య సమన్వయం కొనసాగించడం చాలా ముఖ్యం. లవ్ లైఫ్ కష్టంగా ఉంటుంది, ఓపికగా ఉండాలి.

మిథున రాశి

బుధుడి సంచార సమయంలో మిథున రాశి వారికి సంబంధాలు బలోపేతం అవడం కష్టం అవుతుంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్య అగాథం ఏర్పడే అవకాశం ఉంది. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సంఘటనల వల్ల మానసికంగా కలవరపడటంతో పాటు భాగస్వామితో తరచుగా వాదించడం చేస్తారు.

సింహ రాశి

సింహ రాశి ప్రేమికులు ఈ సమయంలో ఇబ్బంది పడతారు .దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు .ఇది ఒకరి నుంచి మరొకరికి దూరం పెరిగేందుకు కారణం అవుతుంది. గొడవలు జరుగుతాయి. ఇది మిమల్ని మానసికంగా కలవరపెడుతుంది.

వృశ్చిక రాశి

బుధుడి సంచారంతో వృశ్చిక రాశి వారి శృంగార జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. మీరు మీ భాగస్వామి ఒకరినొకరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీ సంబంధాన్ని కొనసాగించడం మీకు కష్టంగా ఉంటుంది. భాగస్వామ్యంలో మీరు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే మీరు దానిని మీ జీవిత భాగస్వామితో చర్చించి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ భాగస్వామికి మధ్య గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా విభేదించవచ్చు. ఎదుటివారి పట్ల మీరు చూపించే అసమ్మతి చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అది కోర్టు వరకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి జాతకులకు ఈ సమయంలో పెద్దగా అదృష్టం ఉండకపోవచ్చు .కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ప్రతికూలంగా మారతాయి .వాటిని భరించడం కష్టంగా ఉంటుంది. మీ సంబంధంలో మీకు ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను సంభాషణ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి .లేదంటే అవి విడిపోయేంతవరకు దారి తీస్తే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం