తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Retrograde: బుధుడి తిరోగమనం.. ఈ ఏడు రాశుల వారికి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి

Mercury retrograde: బుధుడి తిరోగమనం.. ఈ ఏడు రాశుల వారికి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి

Gunti Soundarya HT Telugu

21 March 2024, 7:00 IST

google News
    • Mercury retrograde: బుధుడు మరికొన్ని రోజుల్లో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఆర్థికపరమైన కష్టాలు మొదలుకాబోతున్నాయి. 
బుధుడి తిరోగమనంతో ఆర్థిక కష్టాలు
బుధుడి తిరోగమనంతో ఆర్థిక కష్టాలు

బుధుడి తిరోగమనంతో ఆర్థిక కష్టాలు

Mercury retrograde: గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో తన నడకని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న బుధుడు మార్చి 26 హోలీ తర్వాత మేష రాశిలో ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2 నుంచి మేష రాశిలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. తెలివితేటలు, తర్కం, సంభాషణ వంటి వాటికి బుధుడు ప్రతీకగా భావిస్తారు. బుధు గ్రహ స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారంలో అద్భుతమైన విజయాలు నమోదు చేస్తాడు. అదే బలహీనంగా ఉంటే మాత్రం ఆర్థిక నష్టాలు ఇబ్బంది పెడతాడు.

బుధుడి తిరోగమన ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి వైవాహిక జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. ఉద్యోగ జీవితంలో పురోగతి ఉంటుంది. అయితే బుధుడి తిరోగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో మాత్రం ఆర్థిక ఆందోళనకు దారితీస్తోంది. బుధుడి నడక మార్పు వల్ల ఇబ్బందులు ఎదుర్కోబోతున్న రాశులు ఇవే.

మేష రాశి

మేష రాశిలోనే బుధ గ్రహం తిరోగమనంలో సంచరించడం ప్రారంభంఅవుతుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితి సవాలుగా మారుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు పెట్టడం మానుకోండి. డబ్బులు సరైన విధంగా ప్రణాళికతో ఖర్చు పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలుపరచుకోవాలి. ఇతరుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి.

మకర రాశి

బుధుడి తిరోగమనం కారణంగా మకర రాశి వారికి కష్టంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జించే వ్యక్తులు కొత్త ఒప్పందాలు చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఆదాయం తగ్గుతుంది. లాభాలు తగ్గడం వల్ల ఆర్థిక భారం మీద పడుతుంది. లక్ష్యాలు సాధించడం కష్టంగా ఉంటుంది. డబ్బు ఆదాయం ఈ సమయంలో కుదరదు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం చాలా కష్టంగా మారుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. డబ్బు లేకపోవడం వల్ల మనసు నిరాశ భావంతో నిండిపోతుంది. ఆదాయ మార్గాల కోసం వెతకడంతో పాటు డబ్బు ఆదాచేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిది. షేర్ మార్కెట్లో లాభాలు వస్తే వాటిని మళ్ళీ పెట్టుబడి పెట్టాలని అనుకోవద్దు.

వృశ్చిక రాశి

అంగారకుడు వృశ్చిక రాశిని పాలిస్తాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు నిర్వహించడం కష్టంగా ఉంటుంది. సంపదని కూడబెట్టుకోవడం కష్టమవుతుంది. వ్యాపారవేత్తలకు తక్కువ లాభాలు వస్తాయి. ప్రత్యర్థుల నుంచి ప్రమాదం ఉంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. నిరాశకు గురవుతారు. కుటుంబ ఖర్చులు తీర్చలేక ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ఖర్చులు ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. కొంతమేర నష్టపోయే అవకాశం కూడా ఉంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఆదాయ వనరులు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. డబ్బు ఆదా చేయలేకపోతారు. దూరపు ప్రయాణాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. వాటి వల్ల ఆర్థిక నష్టాలు బాగా పెరుగుతాయి. వృధా ఖర్చులకు దూరంగా ఉండాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈ కాలంలో ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ఖర్చులు మీ మనసుని బాధపెడతాయి. డబ్బు సంపాదించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆకస్మిక ఖర్చుకు మిమ్మల్ని ఒత్తిడిలోకి నెడతాయి.

తదుపరి వ్యాసం