తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: కుజుడి సంచారంతో.. ఈ రాశుల వారి ప్రేమ, వైవాహిక జీవితం చిక్కుల్లో పడబోతుంది

Mars transit: కుజుడి సంచారంతో.. ఈ రాశుల వారి ప్రేమ, వైవాహిక జీవితం చిక్కుల్లో పడబోతుంది

Gunti Soundarya HT Telugu

12 April 2024, 17:06 IST

    • Mars transit: త్వరలో కుజుడు తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ప్రేమ, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురుకాబోతున్నాయి. ఒకరిపై మరొకరికి అపార్థాలు పెరిగి విడిపోయే పరిస్థితి ఏర్పడబోతుంది. 
కుజుడి సంచారం
కుజుడి సంచారం

కుజుడి సంచారం

Mars transit: ఏదైనా గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు దాని ప్రభావం అన్ని రాశి చక్రాల మీద పడుతుంది. ఈ సమయంలో కొందరి ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే మరికొందరికి మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. మరికొద్ది రోజుల్లో కుజుడి సంచారం జరుగుతుంది. దీని ప్రభావంతో వైవాహిక జీవితం, ప్రేమ జీవితం ఇబ్బందుల్లో పడనుంది.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఏప్రిల్ 23వ తేదీ మీన రాశిలో అంగారకుడు ప్రవేశించబోతున్నాడు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే జీవితంలో అన్ని రకాల విలాసాలు అనుభవిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. కెరిర్ లో అద్భుతమైన విజయాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పొందుతారు. అదే కుజుడి స్థానం బలహీనంగా ఉంటే మాత్రం . జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మీన రాశిలో అంగారకుడి సంచారం వల్ల కొన్ని రోజుల వారి ప్రేమ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి.

మేష రాశి

కుజుడి సంచారం వల్ల మేష రాశి వారి ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. భాగస్వామి ప్రవర్తన వల్ల మీరు నిరుత్సాహ పడతారు. మీకు మీ భాగస్వామికి మధ్య సంబంధం చెడిపోయే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య మాధుర్యం, ప్రేమ పూర్వక వాతావరణం కొనసాగించడం కష్టంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓపికగా ఉంటూ భాగస్వామితో మంచి సాంగత్యం ఏర్పడేలాగా ప్రయత్నించాలి.

సింహ రాశి

అంగారకుడి సంచారంతో సింహ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అదే వారితో మీ సంబంధాన్ని భంగం కలిగించేలా చేస్తుంది. చిన్నపాటి అజాగ్రత్త కూడా మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. ఇంట్లో పెద్దవారితో ప్రవర్తించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

తులా రాశి

కుజుడి సంచార ప్రభావంతో తులా రాశి వాళ్ళు వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం కొనసాగించడం కష్టంగా మారుతుంది. ఇద్దరి మధ్య అహంకారానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. భాగస్వామితో ఈ సమయంలో ఎటువంటి వాదనలు పెట్టుకోకుండా ఉండటమే మంచిది. చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతాయి. సంబంధాన్ని కొనసాగించడం కష్టంగా ఉంటుంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పుడే మీ బంధం బలపడుతుంది.

వృశ్చిక రాశి

కుజుడి ప్రభావంతో వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితం సమస్యలతో నిండిపోతుంది. భాగస్వామి పట్ల మీ ప్రవర్తన మార్చుకోవాలి. లేదంటే ఇద్దరు మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. అహంకారంతో ఎదుటివారి మీద గొడవకు దిగకూడదు. సున్నితమైన, మాధుర్యమైన బంధాన్ని కొనసాగించడం ఈ సమయంలో కష్టంగా ఉంటుంది.

మకర రాశి

మకర రాశి జాతకులు వైవాహిక జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. ఇద్దరూ నిత్యం గొడవలు పడుతూ ఉండే ప్రమాదం ఉంది. ఫలితంగా సమస్యలు ఎక్కువగా మారుతాయి. అహంకారం మిమ్మల్ని ఎదుటి వారి ముందు తప్పుగా చూపించే అవకాశం ఉంది. అందుకే జీవిత భాగస్వామితో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తదుపరి వ్యాసం