తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivratri 2023 : మహాశివరాత్రికి ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి?

Maha Shivratri 2023 : మహాశివరాత్రికి ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి?

HT Telugu Desk HT Telugu

14 February 2023, 10:38 IST

google News
    • Maha Shivratri : మహాశివరాత్రి దగ్గరలో ఉంది. ఆ రోజున ఉపవాసం, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. అయితే కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఉపవాసం, జాగరణ చేస్తారు. కొన్ని నియమాలు పాటించాలి.
మహాశివరాత్రి 2023
మహాశివరాత్రి 2023

మహాశివరాత్రి 2023

శివరాత్రి(Shivratri) రోజున ఉపవాసం, జాగరణకు ప్రాధాన్యత ఉంది. దేవదేవుడికి నిష్టతో పూజలు చేస్తారు భక్తులు. చిన్నపిల్లలు, ముసలివాళ్లు, అనారోగ్యంతో బాధపడేవాళ్లు, గర్భవతులు.. ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకున్నా ఏం కాదు. శాస్త్రం కూడా అదే చెబుతుంది. శివరాత్రికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. పరమేశ్వరుడి కరుణ కోసం.. భక్తులు మనస్ఫూర్తిగా మెుక్కుతారు.

ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శివపురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడుకి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఆ రోజున పరమేశ్వరుడిని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. శివపూజ(Shiva Puja), ఉపవాసం, జాగారం. ఇందులో ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఉపవాసం చేసి.. శివనామ స్మరణ చేయడం చాలా ముఖ్యమైనది. ఉపవాసంతో శారీరక శుద్ధి, జాగారం చేస్తూ.. ధ్యానం చేయడం కారణంగా మనోశుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే.. మనసును శివుడికి దగ్గరగా ఉండమని అంటారు.

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డులాంటివి తినకూడదు. మద్యపానం చేయోద్దు. ఉపవాసం చేస్తాం.. ఆకలి అవుతుంది.. కదా.. అనుకుని.. లేటుగా లేవొద్దు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే వారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తల స్నానం చేసి.. శివుడికి ప్రీతికరంగా శివరాత్రి(ShivRatri) ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం.

ఆరోగ్యపరంగా చూసినా.. ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుందట. నీళ్లు కూడా తాగకుండా.. ఉపవాసం చేయోద్దు. అలా చేయోద్దు. శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తీసుకెళ్లడం కష్టం. శివరాత్రి రోజున ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించాలంటే.. వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి.

శివరాత్రికి చేసే జాగరణ(Jagarana) మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా కబుర్లు చెబుతూ.. కాలక్షేపం చేస్తూ.. జాగరణ చేయకూడదు. అది జాగరణ అవ్వదు.. టైమ్ పాస్ మాత్రమే అవుతుంది. మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి.. ప్రశాంతంగా ఉండాలి. శివరాత్రి మరుసటి రోజు.. ఉదయం శివాలయాన్ని సందర్శించి.., ప్రసాదాన్ని తీసుకుని.. ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాసం వ్రతం ముగించాలి.

తదుపరి వ్యాసం