తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Narayana Yogam: లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల మీద లక్ష్మీదేవి అనుగ్రహంతో కాసుల వర్షం

Lakshmi narayana yogam: లక్ష్మీ నారాయణ యోగం.. ఈ రాశుల మీద లక్ష్మీదేవి అనుగ్రహంతో కాసుల వర్షం

Gunti Soundarya HT Telugu

11 February 2024, 7:00 IST

    • Lakshmi narayana yogam: బుధుడు, శుక్రుడు కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం ఫలితంగా కొన్ని రాశుల వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయం పెరుగుతుంది. ఏయే రాశుల వారికి లక్ష్మీ నారాయణ యోగం శుభ ఫలితాలు ఇస్తుందంటే.. 
బుధుడు, శుక్రుడు కలయికతో లక్ష్మీ నారాయణ యోగం
బుధుడు, శుక్రుడు కలయికతో లక్ష్మీ నారాయణ యోగం

బుధుడు, శుక్రుడు కలయికతో లక్ష్మీ నారాయణ యోగం

Lakshmi narayana yogam: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం చాలా కీలకమైనది. ఫిబ్రవరిలో అనేక గ్రహాలు తమ రాశి చక్రాలు మార్చుకుంటున్నాయి. పెద్ద గ్రహాలైన కుజుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు మకర రాశిలో ఉన్నాయి. జనవరి నుంచి గ్రహాల రాజు సూర్యుడు ఇదే రాశిలో ఉన్నాడు. ఇప్పుడు సంపద, ఐశ్వర్యం, ఆకర్షణ, అందం, సంతోషాన్ని ఇచ్చే శుక్రుడు కూడా మకర రాశి ప్రవేశం చేయబోతున్నాడు.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఫిబ్రవరి 12 ఉదయం శుక్రుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒకే రాశిలో నాలుగు ప్రధాన గ్రహాల కలయిక వల్ల అనేక శుభకార్యాలను సృష్టిస్తుంది. బుధుడు, శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుంది. దీంతో ఫిబ్రవరి 12 నుంచి కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ యోగం ప్రభావంతో జీవితంలోని అన్ని బాధల నుంచి విముక్తి కలగబోతుంది. సౌకర్యవంతమైన జీవితం గడపబోతున్నారు.

జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీ నారాయణ యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ యోగం ఉన్న జాతకుల జీవితాలలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. రెండు రోజుల తర్వాత ఏర్పడే ఈ యోగం వల్ల ఏయే రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు కలగబోతున్నాయో చూద్దాం.

మేష రాశి

గ్రహాల యువరాజు బుధుడు, సంపద కారకుడు శుక్రుడు సంయోగం వల్ల మేష రాశి వారికి శుభ దినాలు రాబోతున్నాయి. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. గృహ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థికంగా బలపడతారు.

మిథున రాశి

లక్ష్మీ నారాయణ యోగం వల్ల మిథున రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కఠినమైన సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటారు. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి.

సింహ రాశి

బుధ, శుక్ర కలయిక సింహ రాశి వారి జీవితంలో ప్రేమ నింపుతుంది. సంతానం వైపు నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. బంధాల్లో ప్రేమ పెరుగుతుంది. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంద. సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు.

ధనుస్సు రాశి

లక్ష్మీ నారాయణ యోగం వల్ల ధనుస్సు రాశి వారికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. పిల్లల దగ్గర నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కుంభ రాశి

మకర రాశిలో బుధుడు, శుక్రుడు సంయోగం కుంభ రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశి జాతకులు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు. మీ పనితనం, తెలివితేటలతో నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో పని చేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్థులకు ఈ సమయం అనుకూలంగా మారుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా మారి ఆదాయం పెరుగుతుంది.

తదుపరి వ్యాసం