Visha yogam: కుంభ రాశిలో విష యోగం.. ఈ రాశుల జాతకులకు ధన నష్టం, ఆరోగ్య సమస్యలు-visha yogam 2024 saturn and moon conjunction create visha yogam in kumbha rashi these zodaic sign get trobles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Visha Yogam: కుంభ రాశిలో విష యోగం.. ఈ రాశుల జాతకులకు ధన నష్టం, ఆరోగ్య సమస్యలు

Visha yogam: కుంభ రాశిలో విష యోగం.. ఈ రాశుల జాతకులకు ధన నష్టం, ఆరోగ్య సమస్యలు

Gunti Soundarya HT Telugu
Feb 10, 2024 07:18 AM IST

Visha yogam: కర్మల ఫలదాత శని, చల్లని చూపు చూసే చంద్రుడు కలయిక వల్ల ప్రమాదకరమైన విష యోగం ఏర్పడింది. దీని ఫలితంగా మూడు రాశుల జాతకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు.

కుంభ రాశిలో విష యోగం
కుంభ రాశిలో విష యోగం (pixabay)

Visha yogam: గ్రహాల గమనానికి జ్యోతిష్య శాస్త్రంలో కీలకమైన స్థానం ఉంది. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశి చక్రాలని మార్చుకుంటూ ఉంటాయి. ఫలితంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద పడుతుంది.

పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 10 న కుంభ రాశిలో శని, చంద్రుడు కలవడం వల్ల ప్రమాదకరమైన విష యోగాన్ని సృష్టిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విష యోగం అత్యంత అశుభకరమైన యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం వల్లఒక వ్యక్తి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫిబ్రవరి 10న ఏర్పడే ఈ విష యోగం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఇబ్బందులు తప్పవు. ఈ యోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

విష యోగం ఏర్పడిన జాతకుడి మనసు, శరీరం మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, మనసులో అశాంతి నెలకొనడం, అనారోగ్య సమస్యలు మొదలైనవి చుట్టుముడతాయి. వృత్తిపరమైన రంగాలలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కసారిగా కష్టాలు అన్ని తల మీద పడిన ఫీలింగ్ కలుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయి. కుంభ రాశిలో శని, చంద్రుడు కలయిక కారణంగా ఏయే రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలో చూద్దాం.

మకర రాశి

శని సొంత రాశి అయిన మకర రాశి మీద విష యోగం ప్రభావం కారణంగా ఈ రాశి జాతకులు అశుభ ఫలితాలు ఎదుర్కోబోతున్నారు. ఆర్థిక విషయాల్లో సమస్యలు అధికమవుతాయి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటే మకర రాశి జాతకులు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలోను సమస్యలు ఎదురవుతాయి. మీ మాటలు అదుపులో ఉంచుకోండి. అనవసరమైన అర్థం లేని చర్చలకు దూరంగా ఉండండి.

కుంభం

శని, చంద్రుల కలయిక వల్ల కలిగే విధ్వంసకరమైన విష యోగం ఈ రాశిలోనే ఏర్పబోతుంది. ఫలితంగా కుంభ రాశి జాతాకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. మనసులో నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. మితిమీరిన ఖర్చు కారణంగా మనసు ఆందోళన చెందుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఒక విషయం మీద విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. తెలియని భయం కారణంగా మనసు ఆందోళన పడుతుంది. కొన్ని విషయాల్లో మీకు అపజయం ఎదురవుతుంది.

మీనం

విష యోగం మీన రాశి వారి చెడు ఫలితాలు ఇస్తుంది. పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఊహించని విధంగా మీరు పని చేసే చోట చెడ్డ పేరు వస్తుంది. సంతానం వైపు నుంచి ఇబ్బందులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మితిమీరిన కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. మాటలు ఆచితూచి మాట్లాడటం మంచిది. లేదంటే మీ మాటల వల్ల సమస్యలు మరింత ముదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు.

Whats_app_banner