Panchagrahi yogam: 70 ఏళ్ల తర్వాత మౌని అమావాస్య రోజు మహా యోగం.. ఈ రాశులకు అదృష్టమే అదృష్టం-after 70 years panchagrahi raja yogam will create in makara rashi on the day of mauni amavasya ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Panchagrahi Yogam: 70 ఏళ్ల తర్వాత మౌని అమావాస్య రోజు మహా యోగం.. ఈ రాశులకు అదృష్టమే అదృష్టం

Panchagrahi yogam: 70 ఏళ్ల తర్వాత మౌని అమావాస్య రోజు మహా యోగం.. ఈ రాశులకు అదృష్టమే అదృష్టం

Gunti Soundarya HT Telugu
Feb 08, 2024 10:48 AM IST

Panchagrahi yogam: సుమారు 70 ఏళ్ల తర్వాత మౌని అమావాస్య రోజున అనేక శుభ యోగాలు కలిసి మహా యోగంగా ఏర్పడుతున్నాయి. దీని ఫలితంగా ఐదు రాశుల జాతకులకు అదృష్టం పట్టబోతుంది.

మౌని అమావాస్య 2024
మౌని అమావాస్య 2024

Panchagrahi yogam: మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న మౌని అమావాస్య వచ్చింది. ఈరోజు పవిత్ర స్నానాలకు, దాన ధర్మాలకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, జీవితంలోని అన్ని బాధలు, అవరోధాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

ఈ ఏడాది వచ్చిన మౌని అమావాస్య మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం, వినాయక, అమృత్, హంస, మాలవ్య వంటి శుభ యోగాల కలయిక ఏర్పడబోతుంది. మౌని అమావాస్య రోజు మకర రాశిలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఏడు దశాబ్దాల తర్వాత ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది. వినాయక, అమృత్, హంస, మాలవ్య యోగం సర్వార్థ సిద్ధి యోగంతో కలవడం ద్వారా ఈ మహా యోగం ఏర్పడుతుంది. కొన్ని దశాబ్దాల తర్వాత ఇలాంటి శుభకార్యం జరుగుతోంది. ఈ అద్భుతమైన మహా యోగం కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఆ రాశులు ఏవంటే..

మేషం

కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. వస్తు సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్య, మేధోపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృషభ రాశి

విద్యార్థులకు ఇది మంచి సమయం. సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది.

కర్కాటక రాశి

సర్వార్థ సిద్ధి యోగం ఫలితంగా కర్కాటక రాశి వారికి శుభం చేకూరుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. న్యాయ పరమైన కేసుల్లో విజయం సాధిస్తారు.

మకర రాశి

ఈరోజు మకర రాశిలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా మకర రాశి వారికి అద్భుత ఫలితాలు అందబోతున్నాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు పెరుగుతాయి. కెరీర్ లో సవాళ్లను అధిగమిస్తారు. భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మీన రాశి

మహా యోగంతో మీన రాశి వారికి సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. పిల్లలు శుభవార్తలు అందిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి. వ్యక్తిగత జీవితంలో ఆహ్లాదకరం వాతావరణం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ధనం పొందే అవకాశాలు ఉన్నాయి.

మౌని అమావాస్య ప్రాముఖ్యత

మౌని అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల వంద అశ్వమేధ యజ్ఞాలు ఆచరించిన ఫలితం లభిస్తుంది. మకర రాశిలో సూర్యుని సంచారం వల్ల అమావాస్య ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. మౌని అమావాస్య రోజు మౌనవ్రతం ఆచరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈరోజు దేవతలు, పూర్వీకుల సంగమం ఉంటుందని చెబుతారు. ఈరోజు చేసే జపం అనేక ఫలితాలు ఇస్తుంది. ఈరోజు దానానికి ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. నువ్వులు, నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, ఉసిరి కాయలు, దుప్పట్లు, బట్టలు దానం చేయడం మంచిది. ఇది చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

Whats_app_banner