Jupiter rise: ఉదయించబోతున్న బృహస్పతి.. వీరికి ప్రేమ పెళ్లి జరిగే అవకాశం
28 May 2024, 19:20 IST
- Jupiter rise: మరికొద్ది రోజుల్లో దేవ గురువు బృహస్పతి ఉదయించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అది ఏ రాశి వారికో చూసేయండి.
ఉదయించబోతున్న గురు గ్రహం
Jupiter rise: దేవ గురువు గృహస్పతి త్వరలో ఉదయించబోతున్నాడు. ఏడాది తర్వాత వృషభ రాశిలో బృహస్పతి ప్రవేశించాడు. కొద్ది రోజులకు అస్తంగత్వ దశలోకి వెళ్లాడు. జూన్ 4న ఉదయించబోతున్నాడు.
బృహస్పతి అస్తమించిన సమయంలో ఎటువంటి వివాహాలు, శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైనది కాదు. బృహస్పతి మళ్ళీ ఉదయించినప్పుడు వీటికి అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో వివిధ రంగాలలో అనేక అవకాశాలుఏర్పడతాయి. కొత్త వెంచర్లు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. బృహస్పతి ఉదయించడం వల్ల వ్యక్తులు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. వృషభ రాశిలో బృహస్పతి ఉదయించడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది.
మేష రాశి
మేష రాశి రెండో ఇంట్లో గురు గ్రహం ఉదయిస్తాడు. ఈ రాశి 9, 12వ గ్రహాలను పాలిస్తాడు. సంపదను నిర్మించడంలో విజయం సాధిస్తారు .బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. పనులు పట్ల శ్రద్ధ చూపిస్తారు. నిజాయితీగా ప్రవర్తిస్తారు. బృహస్పతి కుటుంబ సంబంధాలను కొనసాగించడంలో సహాయపడుతుంది .కుటుంబ వ్యాపారంలో భాగమై ఉన్నట్లయితే అందుకు సంబంధించి ఊహించని పర్యటనలు చేస్తారు. రెండో ఇంట్లో బృహస్పతి సంచారం వల్ల కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలు అందుకుంటారు. వివాహానికి అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి 11 వ ఇంట్లో బృహస్పతి ఉదయించబోతున్నాడు. ఆరు, తొమ్మిదో ఇంటికి అధిపతి. పదకొండవ ఇంట్లో ఉదయించడం వల్ల ఈ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఊహించని విధంగా నగదు చేతికి అందుతుంది. వ్యాపారాన్ని కొనసాగించడం సంతృప్తికరంగా, లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ప్రశాంతత లభిస్తుంది. అంతర్గత సంతృప్తి మొత్తం శ్రేయస్సును పెంచుతుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం నుంచి బయట పడతారు.
సింహ రాశి
సింహ రాశి 5, 8 గృహాలను బృహస్పతి పాలిస్తాడు. ఇప్పుడు సింహ రాశి పదో ఇంట్లో బృహస్పతి సంచరిస్తాడు. ఈ సమయంలో ఉద్యోగ మార్పు లేదా బదిలీకి అవకాశం ఉంది. కెరీర్ లో ఎదగడానికి ఇది మంచి అవకాశం. దేవ గురువు కారణంగా ఊహించిన విధంగా డబ్బు, వారసత్వం ఆస్తిని పొందే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సవాళ్లను అధిగమించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొన్ని నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి
బృహస్పతి వృశ్చిక రాశి ఏడవ ఇంట్లో ఉదయించడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ వ్యక్తులకు అన్ని ప్రయోజనాలు అందుతాయి. 2, 5 గృహాలకు బృహస్పతి అధిపతి. ఈ సమయంలో మీ వ్యాపారంలో పురోగతి కనిపిస్తోంది. వ్యాపారంలో సమస్యలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. సంపదలో కొంత భాగాన్ని కంపెనీలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు గడిస్తారు. ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది.
బృహస్పతి పరిహారాలు
వృషభ రాశిలో బృహస్పతి ఉదయించడం వల్ల అనుకూలమైన ప్రయోజనాలు పొందేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. ప్రతిరోజు బృహస్పతి బీజ్ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే విష్ణువును పూజించి, పసుపు మిఠాయిలు సమర్పించాలి. తరచుగా పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. గురువారం ఉపవాసం ఉండాలి .బృహస్పతి యంత్రాన్ని ఇంట్లో స్థాపించి పూజించడం మంచిది.