Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు కుబేరుడిని ఇలా పూజించారంటే మీ ఇంట సిరిసంపదలకు కొదువ ఉండదు
02 May 2024, 14:49 IST
- Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజించాలి. ఇలా పూజించడం వల్ల మీ ఇంత సిరిసంపదలకు కొదువే ఉండదు. డబ్బుకు లోటు అనేది రాదు.
అక్షయ తృతీయ 2024
Akshaya tritiya 2024: హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటిగా అక్షయ తృతీయను భావిస్తారు. ఈరోజు బంగారాన్ని కొంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. వివాహం చేసుకుంటే భార్యాభర్తలు మధ్య ప్రేమ, దాంపత్య జీవితం శాశ్వతంగా ఉంటుందని ఉంటారు.
అక్షయ తృతీయ త్రేతాయుగం ప్రారంభమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీ వచ్చింది. అత్యంత శుభకరమైన గజకేసరి యోగంతో అక్షయ తృతీయ రావడంతో దీని ప్రాముఖ్యత రెట్టింపు అయ్యింది. ఇవి మాత్రమే కాకుండా సుకర్మ యోగం కూడా వస్తుండ. ఈ రోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుడికి పూజ చేయడం వల్ల వచ్చే సంపద, శ్రేయస్సు, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది.
మహాభారతం ప్రకారం ఈరోజే సూర్యుడు యుధిష్టరుడికి అక్షయ పాత్రని ఇచ్చాడని చెబుతారు. దాని నుంచి వచ్చే ఆహారం ఎన్నటికి అయిపోలేదు. అలాగే పరశురాముడు కూడా ఇదే రోజున జన్మించాడు. అందుకే ఆయన్ని చిరంజీవి అని కూడా అంటారు. అక్షయ తృతీయని చిరంజీవి తిథి అని కూడా పిలుస్తారు. కుబేరుడికి స్వర్గం, సంపదకు సంబంధించిన బాధ్యతలు అప్పగించింది రోజు ఇదే.
అక్షయ తృతీయ రోజు ఇలా చేయండి
సంపదకు అధి దేవుడిగా కుబేరుడు ఉంటాడని శివుడు వరం ఇచ్చాడు. అందుకే లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తారు. కుబేరుడి ఆశీస్సులు ఉంటే ఒక వ్యక్తి తన జీవితాంతం డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వాణిజ్యం, సంపద పెరుగుతాయి.
అక్షయ తృతీయ రోజు ధనవంతులు కావాలని అనుకుంటే మీరు ఈ పనులు చేయాలి. చందనం, అక్షితలు, దుర్వా, కమలగట్ట, సెంటు, లవంగాలు, యాలకులు, తమలపాకు, కొత్తిమీర, పండ్లు, పూలు మొదలైన వాటిని సమర్పించాలి. తర్వాత కుబేర చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల సంపదలు పెరుగుతాయని నమ్ముతారు.
సంపదని పొందేందుకు అక్షయ తృతీయ నాడు కుబేర యంత్రాన్ని పూజించి దాన్ని భద్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మీ జీవితంలో సంపద ఎప్పటికీ కరిగిపోదు. ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిండుగా ఉంటుంది.
ఈ మంత్రాన్ని పఠించండి
"ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం ఓం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః" అక్షయ తృతీయ నాడు పూజించేటప్పుడు ఈ కుబేర మంత్రాన్ని 108 సార్లు జపించాలి. బారళీని కొనుగోలు చేసి పూజ సమయంలో కుబేరుడికి సమర్పించాలి. హృదయపూర్వకంగా మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ దూరమై కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సౌభాగ్యాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు.
ఈరోజు విష్ణువు, లక్ష్మీదేవి, అన్నపూర్ణ, కుబేరుడికి బియ్యాన్ని నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ఆ బియ్యాన్ని మీరు ఉపయోగించుకునే బియ్యంలో కలుపుకుని అన్నం వండుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి.
అక్షయ తృతీయ రోజు మీరు కొన్న బంగారు వస్తువులను శివుడి ముందు ఉంచి పూజించాలి. తర్వాత బంగారంపై కొంత గంగా జలం పోసి వాటిని శుభ్రపరచి మీ సేఫ్ లాకర్ లో భద్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు తరిగిపోదు. లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి.