Angaraka yogam: అంగారక యోగం.. నెల రోజులు ఈ రాశుల వారికి ఎటు చూసినా డబ్బే, శత్రువులను ఓడిస్తారు
Angaraka yogam: రాహువు, కుజుడు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడింది. దీని వల్ల జూన్ 1 వరకు ఈ రాశుల వారికి ఎటు చూసినా డబ్బే. అదృష్టం, సంపద, విజయం వీరి సొంతం కాబోతున్నాయి.
Angaraka yogam: జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, శక్తి, పరాక్రమం వంటి వాటికి ప్రత్యేకంగా ఉంటాడు. ప్రస్తుతం కుజుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే అక్కడ రాహువు ఉన్నాడు.
మీనరాశిలో రాహువు, కుజుడు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడింది. జూన్ 1 వరకు ఈ యోగం కొనసాగుతుంది. ఇది రాశి చక్రంలోని మొత్తం 12 రాశుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. అంగారక యోగం అశుభ ప్రభావాలను మాత్రమే కాదు శుభ ఫలితాలు కూడా ఇస్తుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారక యోగాన్ని దురదృష్టకరమైన యోగంగా పరిగణిస్తారు. రాహు, కుజ కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది దీనివల్ల ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఎదురవుతాయి. జీవితంలో హెచ్చుతగ్గులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దురదృష్టకరమైన యోగం సమయంలో ఏ విధమైన శుభకార్యాలు చేయడం మంచిది కాదు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఈ యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. అంగారక యోగం ఈ రాశుల వారికి మేలు చేస్తుంది.
మేష రాశి
మేష రాశి వారికి అంగారక యోగం బాగుంటుంది. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. వృత్తి, డబ్బు వ్యవహారాలలో మంచి అదృష్టం కలిగి ఉంటారు. ప్రత్యర్థులను ఎదిరించగల సామర్థ్యం ఉంటుంది. గొప్ప ఉత్సాహంతో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతర వనరుల నుండి డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.
వృషభ రాశి
అంగారకుడు రాహువు కలయిక వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సంపాదన ఉంటుంది. కంపెనీ వృద్ధిని చేసుకునేందుకు, కొత్త వ్యాపారం చేసేందుకు అవకాశాలు వస్తాయి. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి సహాయాన్ని అందుకుంటారు. వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో డబ్బుని ఆదా చేయగలుగుతారు.
మిథున రాశి
అంగారక యోగం మిథున రాశి వారికి బాగుంటుంది. ఈ సమయంలో వృత్తిలో విజయాన్ని పొందుతారు. మీరు అందుకున్న కొత్త ఉద్యోగ అవకాశాలు సంతృప్తిగా ఉంటాయి. మీ కోరికలన్నీ నెరవేరడంతో సంతృప్తిగా ఉంటారు. పనిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అదృష్టవంతులు అవుతారు. తెలివిగా డబ్బు ఆదా చేయగలుగుతారు. విదేశాల్లో పని చేసే వారికి డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా తారసపడతాయి. వారసత్వ ఆస్తి నుంచి ఊహించని లాభాలు వస్తాయి.
కన్యా రాశి
అంగారక యోగం ప్రభావంతో కన్యా రాశి వారికి అనేక లక్ష్యాలను సాధించే అవకాశం కలుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి రావచ్చు. ఆర్థిక జీవితం పరంగా డబ్బు సంపాదించడం తృప్తినిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకాల రూపంలో బహుమతులు అందుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఆసక్తిగా ఉంటారు. వ్యాపారస్తులు బాగా సంపాదించగలుగుతారు. విద్యా రంగంలో కూడా ప్రయోజనం పొందుతారు. వృత్తిపరమైన మార్గాలు మెరుగుపడతాయి. అంగారకుడి వల్ల ఏర్పడిన ఈ యోగం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వాళ్లు పనిలో కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తిలో ఈ కాలం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉన్నత స్థాయి చేరుకోవడానికి ప్రమోషన్ వంటివి అందుతాయి. విదేశాల నుండి అవకాశాలు అందుకుంటారు. అదృష్టం ఆదాయం రెండూ కలిసి వస్తాయి. పోటీదారులను సమర్ధవంతంగా తిప్పి కొడతారు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.