తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Moon Eclipse: 2024 లో తొలి చంద్రగ్రహణం.. ఈ ఐదు రాశులకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది

Moon eclipse: 2024 లో తొలి చంద్రగ్రహణం.. ఈ ఐదు రాశులకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది

Gunti Soundarya HT Telugu

06 March 2024, 13:12 IST

google News
    • Moon eclipse: కొత్త సంవత్సరం తొలి చంద్ర గ్రహణం మార్చి నెలలో ఏర్పడబోతుంది. హోలీ పండుగ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. 
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే..
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే.. (pixabay)

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే..

Moon eclipse: మార్చి నెల అనేక గ్రహాల కలయిక జరగబోతుంది. అది మాత్రమే కాదు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా మార్చి నెలలోనే ఉంటుంది. హోలీ రోజున అంటే మార్చి 25న తొలి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. భారత్ లో కనిపించకపోవడం వల్ల సూతక్ కాలం పరిగణలోకి తీసుకోరు.

హోలీ, చంద్రగ్రహణం ఒకే రోజు రావడం జరిగింది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉంటాడు. రాహువు కూడా కన్యా రాశిలో ఉండటంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. గ్రహణం మొత్తం నాలుగు గంటలు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభదాయకంగా ఉంటుంది. సంపద పొందుతారు. పనిలో విజయాన్ని సాధిస్తారు. ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం ఏ రాశుల వారికి శుభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం.

మిథున రాశి

మిథున రాశి వారికి చంద్రగ్రహణం శుభ ఫలితాలు ఇవ్వబోతోంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. లావాదేవీలు చేసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు సమయం లభిస్తుంది. డబ్బు తెలివిగా ఖర్చు చేస్తారు అదే విధంగా పొదుపు చేస్తారు.

సింహ రాశి

లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. ఏవైనా కొత్త పనులు వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన సమయం అయితే లావాదేవీలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే అత్యుత్తమ ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార కార్యకలాపాలు లాభంగా సాగుతాయి. నూతన ఆదాయ వనరుల పట్ల సంతృప్తిగా ఉంటారు.

కన్యా రాశి

కన్యా రాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో కన్యా రాశి జాతకులకు చంద్రగ్రహణం నుంచి శుభగడియలు మొదలవుతాయి. మీరు పనిలో విజయం సాధిస్తారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారానికి ఈ సమయం చాలా శుభదాయకం. లాభం ఉంటుంది. ఖర్చుల నియంత్రణలో ఉంచుకోవాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో అదృష్టం కలగబోతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక ఈ సమయంలో తీరుతుంది. లావాదేవీలు అనుకూలిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులు పెట్టుబడులు పెట్టాలని ఆలోచన ఉన్నట్లయితే అందుకు ఇది సరైన సమయం. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కానీ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులకు ఈ సమయం ఒక వరం లాంటిది. లక్ష్మీదేవి ఆశీస్సులతో వాహనం లేదా ఇల్లు కొనేందుకు ప్రయత్నిస్తారు.

మకర రాశి

2024 లో వచ్చే మొదటి చంద్రగ్రహణం మకర రాశి వారికి ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఆ కాలం మీకు మంచి విజయాన్ని అందిస్తుంది.ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు.

 

తదుపరి వ్యాసం