Goddess lakshmi devi: మార్చి నెల ఈ రాశుల జాతకులు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులయ్యే అవకాశం ఉంది-these zodiac signs get goddess lakshmi devi blesinngs on march month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi Devi: మార్చి నెల ఈ రాశుల జాతకులు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులయ్యే అవకాశం ఉంది

Goddess lakshmi devi: మార్చి నెల ఈ రాశుల జాతకులు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులయ్యే అవకాశం ఉంది

Gunti Soundarya HT Telugu
Feb 29, 2024 02:48 PM IST

Goddess lakshmi devi: సంపదకి అధిదేవత లక్ష్మీదేవి. అమ్మవారి కరుణ కోసం అందరూ ఎదురు చూస్తారు. ఈ రాశుల వారికి మార్చి నెల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అయ్యే అవకాశం లభిస్తుంది.

మార్చి నెల ఈ రాశులకు లక్ష్మీదేవి ఆశీస్సులు
మార్చి నెల ఈ రాశులకు లక్ష్మీదేవి ఆశీస్సులు

Goddess lakshmi devi: మార్చి నెల కొందరిని ధనవంతులని చేయబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంట సంపద పెరగనుంది. అనేక మార్గాల ద్వారా లాభాలు రావడంతో ఆదాయం పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా మార్చి నెలలో అనేక పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకుంటూ ఉంటున్నాయి. ఫలితంగా వాటి ప్రభావం కూడా 12 రాశుల మీద ఉండనుంది. శుక్రుడు, కుజుడు, సూర్యుడు, బుధుడు వంటి గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం లభించబోతుందో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి జాతకులకు మార్చి నెల అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు అందుతాయి. ఆకస్మిక ధనరాకతో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలోని లాభాలు వస్తాయి. ఉద్యోగ ప్రమోషన్ రావడంతో జీతం పెరుగుదల ఉంటుంది.

కర్కాటక రాశి

ఈ రాశి జాతకులు మార్చి నెలలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద రాక వల్ల ఇంటి వాతావరణం సుఖశాంతులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాసం లభిస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి నూతన మార్గాలు తారసపడతాయి.

తులా రాశి

తులా రాశి జాతకులకు మార్చి నెల ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు మీ చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆదాయం పెంచుకునేందుకు అనేక అవకాశాలు మీకు ఎదురుపడతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి డబ్బు సంపాదించేందుకు మార్చి నెలలో అనేక అవకాశాలు లభిస్తాయి. సరైన ప్రణాళికలతో అవలంభించి మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. ఖర్చులు తక్కువగా ఉంచుకుంటే డబ్బులు ఆదా చేయగలుగుతారు.

ఈ రాశుల వారు ఈ పనులు చేస్తే మంచిది

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పూట అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు, పూలు సమర్పించి పూజ చేయడం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం ఖీర్ సమర్పించాలి. అలాగే మీ ఆదాయంలో కొంత భాగాన్ని దానధర్మాలు చేసేందుకు ఉపయోగించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉంటుంది. మీకు మరింత ధన లాభం కలుగుతుంది.

అలాగే ఖర్చులు నియంత్రణలో ఉంచుకొని డబ్బులు ఆదా చేసుకునేందుకు మెరుగైన ప్రణాళికలు రచించుకోవాలి. డబ్బు ఆదా చేసుకునేందుకు ఇది అనువైన సమయం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. బుద్ధిపూర్వకంగా ఆలోచించి పెట్టుబడి పెడితే మంచి లాభాలు గడిస్తారు. కష్టపడి పని చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. మీరు ధనవంతులయ్యే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం కృషి, పట్టుదలతో ముందుకు సాగాలి.

లక్ష్మీదేవిని సంతోషపరిచే పనులు

ఇంటి ఉత్తర దిశను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దిశలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ దిశలో అదృష్టాన్ని ఇచ్చే మొక్కలు నాటుకోవచ్చు. అవి మీకు అదృష్టాన్ని, సానుకూల శక్తిని ఇస్తాయి. తులసి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉత్తర దిశలో తులసి మొక్క ఉండే విధంగా చూసుకోండి.

ప్రతి గురువారం విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే అరటి చెట్టు దగ్గర పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. గురువారం నాడు ఈ చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల జీవితంలోని బాధలు తొలగిపోతాయి. లక్ష్మీ చాలీసా పఠించాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి, అలంకరణ వస్తువులు పూజలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది.

Whats_app_banner