Goddess lakshmi devi: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి-these zodiac signs are goddess lakshmi devi favorite ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi Devi: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి

Goddess lakshmi devi: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Feb 23, 2024 09:21 AM IST

Goddess lakshmi devi: ప్రతి ఒక్కరి ఆరాటం లక్ష్మీదేవి కటాక్షం కోసమే. అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం అందరూ తాపత్రాయపడతారు. కానీ ఈ రాశులు అంటే మాత్రం లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి అందులో మీరు ఉన్నారా లేదా?

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే
లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే

Goddess lakshmi devi: ధనం మూలం ఇదం జగత్ అంటారు. ధనం లేనిది ఎవరూ జీవించలేరు. ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బేనని అంటారు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు డబ్బు ఎలా సంపాదించాలో ఏ విధంగా ఆదాయమార్గాలు వెతుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు.

వ్యాపారం, ఉద్యోగం, రోజువారీ పనులు ఇలా ఏదో ఒకటి చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాని పొదుపు చేసుకోవడం మరొక ఎత్తు. సంపద విషయంలో జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం కీలక పాత్ర పోషిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాశులలో కొన్నింటి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

సంపదకు అది దేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు. అమ్మవారి కటాక్షం కోసం, లక్ష్మీదేవిని సంతోషపరిచేందుకు పూజలు చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవికి కొన్ని రాశులు అంటే అమితమైన ప్రీతి. వారి మీద ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఏ పని చేసిన అందులో విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి వీరింట కొలువై ఉంటుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితం సంతోషకరంగా ఉంటుంది. తనకి డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు. మొత్తం 12 రాశులలో ఐదు రాశులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

వృషభ రాశి

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులలో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆర్థికపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వృషభ రాశి జాతకులు నిజాయితీ, దయగల స్వభావం కలిగి ఉంటారు.ఏదైనా కార్యం తల పెడితే వీరికి అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. ఆదాయం పెంచుకునే మార్గాలు ఎక్కువగా ఉంటాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి విశేషమైన ఆశీస్సులు ఉంటాయి.ఈ రాశి జాతకులు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాళ్లు. అందుకే వీరికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మంచి స్వభావం, గుణగణాలతో ఇతరుల హృదయాలను సులువుగా గెలుచుకుంటారు. లక్ష్మీదేవి ఈ రాశి జాతకుల వెంట కొలువై ఉండడానికి ఇష్టపడుతుంది.

సింహ రాశి

సింహ రాశి జాతకులకు లక్ష్మీదేవి చల్లని చూపు ఎప్పుడూ ఉంటుంది. ఆర్థికపరంగా ఎటువంటి ఇబ్బందులు ఈ రాశి జాతకులు ఎదుర్కోరు. లక్ష్మీదేవి అనుగ్రహం, అదృష్టం రెండు కలిసి ఉండటం వల్ల వీళ్ళు చేపట్టిన ఏ పని అయినా అందులో సంపూర్ణ విజయం సాధిస్తారు. ఎంతటి కష్టమైనా భరించి కృషితో తలపెట్టిన కారణం పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు.

వృశ్చిక రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశి జాతకులు వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో అదృష్టవంతులుగా పేరు పొందుతారు. జీవితంలో అన్నీ ఆనందాలను అనుభవించగలుగుతారు. ఆదాయం మెండుగా ఉంటుంది.

WhatsApp channel