Rahu Mercury conjunction: 18 ఏళ్ల తర్వాత రాహువు, బుధుడి కలయిక.. ఈ రాశుల జాతకులకు అదృష్టం రెట్టింపు-rahu mercury conjunction after 18 years these zodiac signs get double benefits in march 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Mercury Conjunction: 18 ఏళ్ల తర్వాత రాహువు, బుధుడి కలయిక.. ఈ రాశుల జాతకులకు అదృష్టం రెట్టింపు

Rahu Mercury conjunction: 18 ఏళ్ల తర్వాత రాహువు, బుధుడి కలయిక.. ఈ రాశుల జాతకులకు అదృష్టం రెట్టింపు

Gunti Soundarya HT Telugu

Rahu mercury conjunction: రాహువు, బుధుడు కలయిక మీన రాశిలో జరగబోతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారి అదృష్టం రెట్టింపు కాబోతుంది. వ్యాపారం విస్తరించేందుకు అవకాశాలు వస్తాయి.

18 సంవత్సరాల తర్వాత రాహు బుధ కలయిక

Rahu mercury conjunction: గ్రహాల రాకుమారుడు బుధుడు ఛాయా గ్రహం రాహువు ఉన్న మీన రాశిలో ప్రవేశించబోతున్నాడు. రాహువు, బుధుల కలయిక సుమారు 18 సంవత్సరాల తర్వాత జరగబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు అశుభ గ్రహంగా పరిగణిస్తారు. ఇక బుధుడు శుభ గ్రహంగా పేర్కొంటారు.

మార్చి 7వ తేదీన బుధుడు రాహువు ఉంటున్న మీన రాశిలో సంచరిస్తాడు. రాహువు ఎప్పుడు ఇబ్బందులు, కష్టాలు సృష్టిస్తాడని అనుకుంటారు. కానీ రాహు స్థానం బలంగా ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటాయి. నిర్భయంగా ముందడుగు వేస్తారు. బుధుడు తెలివితేటలు, విచక్షణ, ఏకాగ్రత, అందం, వ్యాపారం మేధస్సు వంటి వాటికి కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు, రాహు కలయిక శుభ, అశుభ ప్రభావాలు చూపూస్తుంది. అయితే మీనంలో రాహువు బుధుడు కలసి ఉండటం వల్ల వృషభం, కుంభం సహ కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి.

వృషభం

రాహువు, బుధ సంయోగం వల్ల వృషభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వస్తు సంపద పెరుగుతుంది. జీవితం సుఖాలతో నిండిపోతుంది. విద్య, మేధోపరమైన పనుల్లో శుభవార్తలు అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రెండు విభిన్న గ్రహాల కలయిక అనుకూల ఫలితాలు ఇస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లాలనుకునే వారికి ఈ సమయంలో కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పరంగాను లాభ పడతారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. వ్యాపార అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.

సింహ రాశి

రాహువు, బుధుడు కలయిక సింహ రాశి వారికి డబ్బు వచ్చేలా చేస్తుంది. గతంలో చేసిన రుణాలని తీర్చగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో లభిస్తుంది. వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఒంటరి వ్యక్తుల జీవితంలోకి కొత్త వ్యక్తి అడుగుపెడుతుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి జాతకులకు రాహు, బుధ కలయిక శుభ ఫలితాలు ఇవ్వబోతుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది కానీ డబ్బులు ఖర్చు చేస్తారు. ఈ రాశి వారి ప్రేమ జీవితం అద్భుతాలతో నిండిపోతుంది. జీవిత భాగస్వాముల మధ్య అనురాగం పెరుగుతుంది.

కుంభ రాశి

అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి దొరుకుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్దికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారం విస్తరించుకునేందుకు కొత్త అవకాశాలు తారసపడతాయి.

మీన రాశి

వృత్తిగత జీవితంలో శ్రమకు ప్రశంసలు దక్కుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. వ్యాపారం లాభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.