Unlucky zodiac signs: మార్చి నెల ఈ రాశుల జాతకులకు గడ్డు కాలమే.. జాగ్రత్త అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి
Unlucky zodiac signs: మార్చి నెలలో గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురుకాబోతున్నాయి. ఏయే రాశుల వారికి వచ్చే నెల కలిసి రాదో తెలుసుకోండి.
Unlucky zodiac signs: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి కీలక ప్రాధాన్యం ఉంటుంది. మార్చి నెలలో అనేక పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలు మార్చుకుంటున్నాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు, శుభ గ్రహంగా పరిగణించే శుక్రుడు, గ్రహాల రాజు సూర్యుడు, అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణించే కుజుడు ఈ సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తున్నాయి.
అస్తంగత్వ దశలో ఉన్న శని, బుధుడు కూడా ఇదే నెలలో ఉదయించబోతున్నారు. బుధుడు మీన రాశిలో ప్రవేశిస్తే.. శుక్రుడు శని ఉంటున్న కుంభ రాశిలో సంచరించబోతున్నాడు. ఛాయా గ్రహమైన రాహువు ఉంటున్న మీన రాశిలోకి బుధుడు వెళ్లబోతున్నాడు. సుమారు 18 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతుంది. ఇక శని సంచరిస్తున్న కుంభ రాశిలో సూర్యుడు, కుజుడు ఉంటారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అంగారకుడు, శని గ్రహాల కలయిక చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. మార్చి నెలలో జరుగుతున్న గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. రాశులు మారిన గ్రహాల పరిణామం ఏయే రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏయే రాశుల జాతకులు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం.
తులా రాశి
మార్చి నెల తులా రాశి వారికి సమస్యలు తీసుకురాబోతుంది. గతంలో అనేక కారణాల వల్ల నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. కానీ ఈ రాశి జాతకలు తమ కెరీర్ లో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. సూర్యుడు, శుక్రుడు, శని తులా రాశి ఐదో ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారాలు చేసే వివాదాస్పద పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కొంత గందరగోళం, వివాదాలు జరుగుతాయి. గృహ విషయాలలో సమస్యలు ఎదురవుతాయి.
మకర రాశి
గ్రహాల గమనం వల్ల మకర రాశి వారికి ఈ నెల గౌరవం లభిస్తుంది. అయితే కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో కుజుడు, శని యోగం ఉండటం వల్ల కుటుంబంలో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రించుకోవాలి లేదంటే సమస్యలు మరింత జఠిలం అవుతాయి.
ధనుస్సు రాశి
మార్చి నెలలో గ్రహాల మార్పు వల్ల ధనస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. కానీ చాలా శ్రమించాల్సి వస్తుంది. బాగా కష్టపడిన తర్వాత మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ కాలంలో కుటుంబ జీవితం కూడా కొంత కష్టంగా ఉంటుంది. మీ పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు ఎదుర్కొంటారు. మీ మనసు కొన్ని విషయాల పట్ల కలవరపడుతుంది. చాలా అసంతృప్తిగా కనిపిస్తారు. వినోదం కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు.
మీన రాశి
మార్చిలో మీన రాశికి చెందిన జాతకుల ఆదాయంతో పోలిస్తే వారి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శని గ్రహ ప్రభావం వల్ల అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు చేస్తారు. మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తోబుట్టువులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. ఇవి వారిని మరింత ఇబ్బందులలో పడేస్తాయి.