March month horoscope: మార్చి నెలలో గ్రహాల గమనం.. ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకం, ఎందుకో తెలుసా?-march month horoscope these zodiac signs get good days with major planet transit ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  March Month Horoscope: మార్చి నెలలో గ్రహాల గమనం.. ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకం, ఎందుకో తెలుసా?

March month horoscope: మార్చి నెలలో గ్రహాల గమనం.. ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకం, ఎందుకో తెలుసా?

Gunti Soundarya HT Telugu

March month horoscope: మార్చి నెలలో ఐదు పెద్ద గ్రహాలు రాశి చక్రాలు మారుతున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి మార్చి నెల ప్రత్యేకంగా మారబోతుంది. ఈ రాశులు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

గ్రహాల గమనం,, మార్చి నెల ఈ రాశులకు వరం (pixabay)

March month horoscope: మార్చి నెలలో అనేక గ్రహాలు తమ కదలికలను మార్చుకోబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రోజుల తర్వాత గ్రహాలు రాశి చక్రాలను మార్చుకుంటూ సంచరిస్తాయి. మార్చి నెలలో ఐదు గ్రహాలు రాశి చక్రాలు మారుస్తున్నాయి. వాటిలో శుక్రుడు ఒకే నెలలో రెండుసార్లు రాశులను మారబోతున్నాడు.

మార్చి నెల ప్రారంభంలో గ్రహాల రాకుమారుడు బుధుడు, రాహువు ఉంటున్న మీనరాశిలో సంచరిస్తాడు. ఈ రెండు గ్రహాల కలయిక 18 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. తర్వాత మార్చి 12న శుభాలనిచ్చే శుక్రుడు శని సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రవేశిస్తాడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న గ్రహాల రాజు సూర్యుడు మీన రాశి ప్రవేశం చేస్తాడు.

రెండు సార్లు రాశి మారనున్న శుక్రుడు

శని సంచరిస్తున్న కుంభ రాశిలో మార్చి 15న కుజుడు ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కర్మల దాత శని అస్తంగత్వ దశ నుంచి ఉదయించే స్థితికి చేరుకుంటారు. ఇక చివరిగా మార్చి 31వ తేదీన శుక్రుడు మరొకసారి రాశి చక్రం మారతాడు. కుంభరాశి నుంచి మీనరాశి ప్రవేశం చేస్తాడు.

ఈ ఐదు పెద్ద గ్రహాల కదలికలతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి చక్ర మార్పులు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. మొత్తం 12 రాశుల వారు గ్రహాల మార్పు వల్ల ప్రభావితం అవుతారు. గ్రహాల సంచారంతో వచ్చే నెల ఏ రాశి వారు ధనవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం.

మార్చి నెలలో శుభ యోగాలు

మార్చి నెలలో అనేక గ్రహాల కలయిక వల్ల శుభ యోగాలు, ఆశుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. మీన రాశిలో బుధుడు, రాహువు కలయిక జరగబోతుంది. దీనివల్ల జడత్వ యోగం సృష్టించబడుతుంది. యోగం ఉన్న జాతకులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో శుక్రుడు తన కదలికను మార్చి శనితో సంయోగం చెందుతాడు. ఇవి రెండూ స్నేహపూర్వక గ్రహాలు. సుమారు 30 ఏళ్ల తర్వాత శుక్రుడు, శని కలయిక జరగబోతుంది.

శుక్రుడు సంపద, ఆనందం, శ్రేయస్సుకు కారకుడుగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మికంగా సంపద పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో అదృష్టం మీకు సహకరిస్తుంది. శని శుక్ర కలయిక వల్ల మరికొన్ని రాశుల జీవితంలో అలజడి మొదలవుతుంది.

ఛాయాగ్రహంగా పేర్కొనే రాహువు సంచరిస్తున్న మీనరాశిలోకి గ్రహాల రాకుమారుడు బుధుడు, గ్రహాల రాజు సూర్యుడు కలుసుకోబోతున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది.

ఈ రాశుల వారికి మార్చి నెల చాలా ప్రత్యేకం

మేషం, కర్కాటకం, కన్య, వృషభ రాశి వారికి మార్చి నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గ్రహాల సంచారం ఈ రాశుల వారికి లాభాలను చేకూరుస్తుంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మునుపటికంటే చాలా మెరుగ్గా ఉంటుంది.

ధన లాభం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరంగా ప్రమోషన్ అందుకుంటారు. లవ్ లైఫ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ సమయంలో మంచి అవకాశం లభిస్తుంది.

ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. జీవితం ఆనందంతో నిండిపోతుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇది అనువైన సమయం. గృహ, వాహన సౌఖ్యం పెరుగుతుంది. సంతానం వైపు నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు.