Tholi ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ 6 పరిహారాలు పాటించారంటే అదృశం, సంతోషం రెట్టింపు అవుతాయి
17 July 2024, 8:00 IST
- Tholi ekadashi 2024: శ్రీ హరివిష్ణువుకు అంకితం చేయబడిన తొలి ఏకాదశి వ్రతం జూలై 17న జరుపుకుంటున్నారు. తొలి ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేస్తే సంతోషం మరియు శ్రేయస్సు పెరుగుతుంది.
తొలి ఏకాదశి పరిహారాలు
Tholi ekadashi 2024: తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి శ్రీ హరివిష్ణువుకు అంకితం చేసినది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి నుంచి ఉపవాసం ఉండటం ఆరంభమైనదని కొందరు చెబుతారు.
ఈ రోజు పూర్ణ భక్తితో శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందవచ్చు. తొలి ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషం పెరుగుతాయి. విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితం సుఖంగా సాగిపోతుంది. మోక్షం లభిస్తుంది.
తొలి ఏకాదశి పరిహారాలు
1. దేవశయని ఏకాదశి రోజున శ్రీ హరి విష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీ కార్యాలయంలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.
2. మీ వైవాహిక జీవితంలో అపశ్రుతులు ఏర్పడి కష్టాలు రోజురోజుకూ పెరుగుతూ ఉంటే దేవశయని ఏకాదశి రోజున తులసి తల్లిని పూజించండి. ఈ రోజున లక్ష్మీదేవి, తులసి మాతకు మేకప్ వస్తువులను సమర్పించండి.
3. దేవశయని ఏకాదశి నాడు దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందువల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగించడానికి తొలి ఏకాదశి రోజున పేదలకు అన్నదానం చేయాలి.
4. దేవశయని ఏకాదశి నాడు భగవద్గీతను పఠించడం పుణ్యమైనదిగా పరిగణిస్తారు.
5. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే దేవశయని ఏకాదశి రోజున పూర్ణ భక్తితో శ్రీమహావిష్ణువును పూజించి తమలపాకుపై ఓం విష్ణువే నమః అని రాసి భగవంతుని పాదాల చెంత సమర్పించండి. మరుసటి రోజు ఈ ఆకును పసుపు గుడ్డలో చుట్టి సురక్షితంగా ఉంచండి.
6. దేవశయని ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి, పరిక్రమ చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది.
ఇవి పొరపాటున కూడా చేయొద్దు
మద్యం సేవించకూడదు, మాంసాహారం తినకూడదు. ఇలా చేస్తే విష్ణువుకు కోపం వస్తుందని చెప్తారు. అలాగే తులసి ఆకులు లేకుండా విష్ణువుకు నైవేద్యం సమర్పించరు. కానీ ఏకాదశి తిథి రోజు తులసి ఆకులు కోయకూడదు. ముందు రోజే కోసి పెట్టుకోవాలి.
ఏకాదశి నాడు అన్నం తినడం మహా పాపంగా నమ్ముతారు. ఈరోజు సకల పాపాలు ధాన్యాలలో నివశిస్తాయని వాటిని తింటే ఆ పాపం శరీరంలోకి చేరుతుందని చెప్తారు. అలాగే ఎవరిని నొప్పించకూడదు. గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరిని కించపరచకూడదు.పూజకు పొరపాటున కూడా నల్లని వస్త్రాలు ధరించకూడదు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభదాయకం.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.