Goddess Lakshmi : దీపావళి రోజు వీటిని చూస్తే.. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది
12 November 2023, 12:08 IST
- Diwali 2023 : దీపావళి హిందువులకు చాలా ప్రత్యేకమైన పండుగ. దీపావళికి లక్ష్మీదేవిని చాలా పవిత్రంగా పూజిస్తారు. దసరాకు పాలపిట్టను చూసిన విధంగానే దీపావళికి కూడా కొన్నింటిని చూస్తే మంచి జరుగుతుందని చెబుతారు.
దీపావళి
దీపావళి ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ. మూడు రోజుల దీపాల పండుగ, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో జరుపుకొంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారు.
ఈ రోజున క్రాకర్స్ పేల్చడమే కాదు, లక్ష్మీ, గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజ చేయడం వల్ల జీవితంలో సమస్యలు తొలగిపోయి జీవితం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. ఈ ఏడాది దీపావళి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ దీపావళి రోజున కొన్ని శుభ యోగాలు, అరుదైన గ్రహ స్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఈ దీపావళి అనేక ప్రయోజనాలను తెస్తుంది.
దీపావళి నాడు సంపద కోసం లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి వచ్చే కొన్ని సంకేతాలను చూపుతుందని చెబుతారు. దీపావళి రోజున కొన్నింటిని ప్రత్యేకంగా చూడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
దీపావళి రోజు రాత్రి గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు రాత్రి గుడ్లగూబను చూస్తే మీకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉందని అర్థం. ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. ఐతే దీపావళి రోజు గుడ్లగూబను చూస్తే మీకు అదృష్టం ఖాయం.
నమ్మకాల ప్రకారం, దీపావళి రోజున మీ ఇంట్లో ముల్లెయిన్ మెుక్క కనిపిస్తే, కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉందని అర్థం. అటువంటి పరిస్థితిలో మరింత డబ్బు చేతిలోకి వస్తుంది. విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో శాంతి, ఆనందం కలుగుతాయి.
హిందూ మతంలో గోవుకు ప్రాధాన్యత ఉంది. దేవతలందరూ గోవులో నివసిస్తారని అంటుంటారు. దీపావళి రోజున మీ ఇంటి దగ్గరలో ఆవు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం. ఈ పరిస్థితిలో ఇంట్లో సంపద పెరుగుతుంది. మీరు అనుకున్నదానిలో విజయం సాధిస్తారు.
బల్లులు అన్ని ఇళ్లలో సాధారణం. అయితే దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఎక్కువగా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ప్రతి కోరిక నెరవేరుతుంది.
నమ్మకాల ప్రకారం, దీపావళి నాడు రాత్రిపూట పిల్లిని చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు. జీవితంలో సమస్యలు తీరి, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి, విజయాన్ని పొందుతారు.